విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఆదివాసి దినోత్సవ వేడుకలకు సీఎం చంద్రబాబు, మంత్రి గుమ్మడి సంధ్యారాణి హాజరయ్యారు. గిరిజన సంప్రదాయ నృత్యాల్లో కళాకారులతో పాటు చంద్రబాబు సైతం పాల్గొన్నారు. కళాకారుల డప్పు తీసుకుని స్వయంగా డప్పు వాయించారు. గిరిజన లంబాడి కళాకారులతో సరదాగా కాసేపు ముచ్చటించారు. అంతకుముందు అడవి తల్లికి చంద్రబాబు సారే సమర్పించారు.