అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు రెండూ బీజేపీకి తొత్తులని ఏపీపీసీసీ అధ్యక్షుకారాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. టీడీపీ వైసీపీ ట్రాప్ లో ప్రజలు పడవద్దని షర్మిల విజ్ఞప్తి చేశారు. ఐదేళ్లలో బీజేపీని ఎప్పుడూ ఈ రెండు పార్టీలు అస్సలే విమర్శించ లేదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదాపై సంతకం పెడతామని హామీ ఇచ్చారని షర్మిల తెలిపారు.