ipl-2024-points-table News, ipl-2024-points-table News in telugu, ipl-2024-points-table న్యూస్ ఇన్ తెలుగు, ipl-2024-points-table తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  ipl 2024 points table

Latest ipl 2024 points table Photos

ఐపీఎల్ 2024 సీజన్‍‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్, సన్‍రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్ చేరాయి. లీగ్ దశ మ్యాచ్‍లు ఆదివారం (మే 19) ముగిశాయి. పాయింట్ల పట్టికలో కోల్‍కతా టాప్ ప్లేస్‍ను దక్కించుకుంది. లీగ్ దశలో 14 మ్యాచ్‍ల్లో 9 గెలిచి, మూడు ఓడింది. రెండు మ్యాచ్‍లు రద్దయ్యాయి. 20 పాయింట్లు (1.428 నెట్‍ రన్‍రేట్) కేకేఆర్ ఖాతాలో ఉన్నాయి. దీంతో పాయింట్ల టేబుల్‍లో టాప్ ప్లేస్ దక్కించుకుంది.

IPL 2024 Points Table: లీగ్ దశ ముగిసింది.. ఐపీఎల్ 2024 సీజన్‍ పాయింట్ల టేబుల్‍లో ఏ జట్టు ఏ స్థానంలో ఉంది?

Monday, May 20, 2024

పంజాబ్‍తో ఓటమి తర్వాత కూడా రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగింది. అయితే, ఈ ప్లేస్ నిలబెట్టుకోవడం సందిగ్ధంగా మారింది. ఇప్పటి వరకు 13 మ్యాచ్‍ల్లో 8 గెలిచి, 5 ఓడింది రాజస్థాన్. దీంతో 16 పాయింట్లతో (+0.273)లో పట్టికలో రెండో ప్లేస్‍లో ఉంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరినా గత నాలుగు మ్యాచ్‍ల్లో వరుసగా ఓడి ఫామ్ కోల్పోయింది. రాజస్థాన్‍కు మరో లీగ్ మ్యాచ్ మిగిలిఉంది.

IPL 2024 Points Table: పంజాబ్‍ చేతిలో రాజస్థాన్ ఓటమి.. పాయింట్ల పట్టిక, ప్లేఆఫ్స్ రేస్ ఎలా ఉన్నాయంటే!

Thursday, May 16, 2024

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ టాప్ లోనే కొనసాగుతోంది. గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ రద్దవడంతో ఒక పాయింట్ వచ్చింది. దీంతో 13 మ్యాచ్ లలో 19 పాయింట్లు, 1.428 నెట్ రన్ రేట్ తో తొలి స్థానంలో ఉంది. అంతేకాదు కేకేఆర్ కచ్చితంగా టాప్ 2లోనే లీగ్ స్టేజ్ ముగించడం ఖాయంగా కనిపిస్తోంది.

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్.. గుజరాత్ టైటన్స్ ఔట్.. ఇక రేసులో ఆరు టీమ్స్

Tuesday, May 14, 2024

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024లో ఆదివారం (మే 12) జరిగిన కీలకమైన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ మూడో స్థానానికి ఎగబాకింది. 13 మ్యాచ్ లలో ఏడు విజయాలతో 14 పాయింట్లు సీఎస్కే ఖాతాలో ఉన్నాయి. సన్ రైజర్స్ కంటే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో చెన్నై మూడో స్థానానికి చేరింది.

IPL 2024 Points Table: రెండు మ్యాచ్‌లతో మొత్తం మారిపోయిన పాయింట్ల టేబుల్.. సీఎస్కే, ఆర్సీబీ స్థానాలు ఇలా..

Monday, May 13, 2024

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 30) జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ చేతుల్లో ఓడిపోయింది ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ లో ముంబై బ్యాటింగ్ వైఫల్యంతో కేవలం 144 రన్స్ చేయగా.. తర్వాత కాస్త కష్టంగానే అయినా ఆ టార్గెట్ ను చేజ్ చేసింది లక్నో సూపర్ జెయింట్స్. 4 వికెట్లతో విజయం సాధించింది.

IPL 2024 Points Table: లక్నో దెబ్బకి టాప్ 4 నుంచి సన్ రైజర్స్ ఔట్.. ముంబై ఇండియన్స్ ఇక ఇంటికే..

Wednesday, May 1, 2024

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024లో ఆదివారం (ఏప్రిల్ 28) జరిగిన రెండు మ్యాచ్ ల తర్వాత పాయింట్ల టేబుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ పైకి రాగా.. సర్ రైజర్స్ దిగజారింది. ఈ మ్యాచ్ లో సీఎస్కే ఏకంగా 78 పరుగులతో సన్ రైజర్స్ ను చిత్తు చేసిన విషయం తెలిసిందే.

IPL 2024 Points Table: సన్ రైజర్స్ కిందికి.. చెన్నై పైకి.. సూపర్ సండే రెండు మ్యాచ్‌ల తర్వాత పాయింట్ల టేబుల్ ఇలా..

Monday, April 29, 2024

IPL 2024 Orange Cap: గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ 43 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ తో అతడు ఆరెంజ్ క్యాప్ లిస్టులో ఏకంగా మూడో స్థానానికి దూసుకొచ్చాడు. అతడు 9 మ్యాచ్ లలో 342 రన్స్ చేశాడు. ట్రావిస్ హెడ్, రియాన్ పరాగ్ లను వెనక్కి నెట్టడం విశేషం.

IPL 2024 Orange Cap: మెరుపు ఇన్నింగ్స్‌తో ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చిన రిషబ్ పంత్

Thursday, April 25, 2024

IPL 2024 Points Table: బుధవారం (ఏప్రిల్ 24) జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ ను 4 పరుగులతో చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో స్థానానికి దూసుకెళ్లింది. ఆ టీమ్ 9 మ్యాచ్ లలో 4 గెలిచి, 5 ఓడింది. 8 పాయింట్లు, -0.386 నెట్ రన్ రేట్ తో ఉంది. ఢిల్లీ దూకుడు చెన్నైకి డేంజర్ బెల్స్ లా కనిపిస్తోంది.

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్.. ఒక్కో మెట్టు పైకి ఎక్కేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్..

Thursday, April 25, 2024

IPL 2024 Points Table: మొన్న కేఎల్ రాహుల్, డికాక్.. ఇప్పుడు మార్కస్ స్టాయినిస్.. నాలుగు రోజుల వ్యవధిలో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ను రెండుసార్లు ఓడించిన లక్నో సూపర్ జెయింట్స్ సంచలనం సృష్టించింది. ఈ విజయంతో లక్నో 8 మ్యాచ్ లలో 5 విజయాలు, 10 పాయింట్లతో టాప్ 4లోకి దూసుకొచ్చింది. ఇప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ లతో సమానంగా నిలిచింది. అయితే నెట్ రన్ రేట్ విషయంలో కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్ మెరుగ్గా ఉండటంతో ఆ టీమ్స్ 2, 3 స్థానాల్లో ఉండగా.. లక్నో 4వ స్థానంలో ఉంది. ప్రస్తుతం లక్నో నెట్ రన్ రేట్ 0.148గా ఉంది.

IPL 2024 Points Table: చెన్నై సూపర్ కింగ్స్‌పై వరుసగా రెండో విజయంతో పాయింట్ల టేబుల్ మార్చేసిన లక్నో సూపర్ జెయింట్స్

Wednesday, April 24, 2024

IPL 2024 Points Table: 37 మ్యాచ్ ల తర్వాత రాజస్థాన్ రాయల్స్ టాప్ లోకొనసాగుతోంది. ఆ టీమ్ 7 మ్యాచ్ లలో 6 గెలిచి 12 పాయింట్లతో ఉంది. నెట్ రన్ రేట్ కూడా 0.677గా ఉంది.

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 సగం ముగిసింది.. 37 మ్యాచ్‌ల తర్వాత పాయింట్ల టేబుల్ ఇలా ఉంది

Monday, April 22, 2024

IPL 2024 Points Table after rcb vs srh: ఆర్సీబీపై గెలిచిన తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ 6 మ్యాచ్ లలో 4 గెలిచి, రెండు ఓడి 8 పాయింట్లతో ఉంది. కేకేఆర్, సీఎస్కే ఖాతాల్లోనూ 8 పాయింట్లే ఉన్నా.. నెట్ రన్ రేట్ (0.502) విషయంలో ఎస్ఆర్‌హెచ్ వెనుకబడింది. ఐపీఎల్లో రికార్డు స్కోరుతో చరిత్ర సృష్టించిన సన్ రైజర్స్.. భారీ విజయం సాధించి ఉంటే రెండో స్థానానికి కూడా దూసుకెళ్లే అవకాశం ఉండేది. కానీ 25 పరుగులతోనే గెలవడంతో నాలుగో స్థానంలోనే ఉంది.

IPL 2024 Points Table: రికార్డుల మ్యాచ్‌లో విజయం తర్వాత కూడా మారని సన్ రైజర్స్ స్థానం.. ఎందుకంటే?

Tuesday, April 16, 2024

ఐపీఎల్ 2024 టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ (RR)పై గుజరాత్ టైటాన్స్ (GT) ఉత్కంఠ విజయం సాధించింది. జైపూర్‌లో బుధవారం (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్‍లో 3 వికెట్ల తేడాతో చివరి బంతికి గుజరాత్ గెలిచింది. దీంతో నాలుగు గెలుపుల తర్వాత రాజస్థాన్‍కు ఓటమి ఎదురైంది. ఈ సీజన్‍లో గుజరాత్ మూడో విజయం సాధించింది. ఇప్పటి ఆరు మ్యాచ్‍ల్లో మూడు గెలిచిన గుజరాత్ 6 పాయింట్లతో (-0.63 నెట్‍ రన్‍రేట్) పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. మరో నాలుగు టీమ్‍లు కూడా ప్రస్తుతం ఆరు పాయింట్లతోనే ఉండగా.. నెట్‍రన్ రేట్ తక్కువగా ఉండడం వల్ల గుజరాత్ ఆరో ప్లేస్‍లో ఉంది. ఈ మ్యాచ్ ముందు ఏడో స్థానంలో ఉన్న గుజరాత్.. గెలుపుతో ఓ ప్లేస్ పైకి వచ్చింది.

IPL 2024 Points Table: ఓడినా టాప్‍లోనే రాజస్థాన్ రాయల్స్.. ఓ ప్లేస్ పైకి వచ్చిన గుజరాత్

Thursday, April 11, 2024