TS Rain Alert: తెలంగాణలో నాలుగు రోజులు వానలే వానలు.. ఆరెంజ్ అలర్ట్‌ జారీ-warning that there is a possibility of heavy rains in telangana for four days ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Rain Alert: తెలంగాణలో నాలుగు రోజులు వానలే వానలు.. ఆరెంజ్ అలర్ట్‌ జారీ

TS Rain Alert: తెలంగాణలో నాలుగు రోజులు వానలే వానలు.. ఆరెంజ్ అలర్ట్‌ జారీ

HT Telugu Desk HT Telugu
Jul 31, 2023 11:53 AM IST

TS Rain Alert: తెలంగాణలో రానున్న మూడు నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసింది.

తెలంగాణలో నాలుగు రోజులు వానలే వానలు
తెలంగాణలో నాలుగు రోజులు వానలే వానలు (Unsplash)

TS Rain Alert:తెలంగాణలోని 9 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. రానున్న మూడు, నాలుగు రోజులు తేలిక పాటి నుంచి భారీ వర్షాలుకురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన గాలుల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమబెంగాల్‌, జార్ఖండ్‌పై అల్పపీడనం ఏర్పడిందని వివరించింది.మంగళవారం నాటికి దక్షిణ దిశకు కదిలే సూచనలున్నాయని పేర్కొంది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం భారీగా, బుధవారం అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేసింది. గురు, శుక్రవారాల్లోనూ వర్షాలు కొనసాగనున్నాయని అంచనా వేసింది. బుధవారం లోగా బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంపై గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని అంచనా.

ఝార్ఖండ్‌ దక్షిణ ప్రాంతంపై 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు మరో ఉపరితల ఆవర్తనం ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అక్కడక్కడ స్వల్పంగా వర్షాలు కురిశాయి. నిజామాబాద్‌ జిల్లా మెండోరాలో 1.9, నిర్మల్ జిల్లా భైంసాలో 1.2, జగిత్యాల జిల్లా గోధూరులో 1.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన గాలుల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమబెంగాల్‌, జార్ఖండ్‌పై అల్పపీడనం ఏర్పడింది.ఇది మంగళవారం నాటికి దక్షిణ దిశకు కదిలే సూచనలున్నాయి. బంగాళాఖాతంలో ఈ నెల 18న మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో వర్షాలు మరింత పెరుగుతాయని అంచనా వేసింది.

పశ్చిమ దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటంతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం రాత్రి వరకు భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు మరికొన్ని జిల్లాల్లో అతిభారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. బుధవారం నుంచి గురువారం సాయంత్రం వరకు ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది.

Whats_app_banner