పదో తరగతి పరీక్షలకు “టీఎస్‌ఆర్టీసి ” బస్సుల్లో ఫ్రీ జర్నీ
పదో తరగతి పరీక్షల నేపథ్యంలో తెలంగాణలో బస్‌పాస్‌ల గడువును జూన్ 1వరకు పొడిగించారు. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని టిఎస్‌ఆర్టీసి ఎండి సజ్జనార్ కోరారు.
తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్దులకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అనుమతిస్తూ టిఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం విద్యార్ధులు వినియోగిస్తున్న బస్ పాస్‌ల గడువు ముగిసిన తర్వాత కూడా జూన్ 1వ తేదీ వరకు చెల్లుబాటవుతాయని ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా విద్యార్ధులకు పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉన్నా బస్ పాస్, హాల్‌టిక్కెట్లను చూపించి ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించవచ్చని ఎండీ విసి.సజ్జన్నార్ ట్వీట్ చేశారు. తెలంగాణలో మే 23 నుంచి జూన్1 వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. కోవిడ్ తర్వాత నిర్వహిస్తున్న పరీక్షలు కావడంతో ఈ ఏడాది ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. సిలబస్‌లో 70శాతం నుంచే ప్రశ్నాపత్రాలు ఇవ్వనున్నారు. గతంలో పదో తరగతి పరీక్షలకు రెండు గంటల 45నిమిషాల వ్యవధి ఉంటే ఇప్పుడు దానిని 3.15గంటలకు పెంచారు.
టాపిక్