Hyderabad Traffic: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపు-traffic diversion in many areas in hyderabad in view of telangana formation day celebrations ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Traffic Diversion In Many Areas In Hyderabad In View Of Telangana Formation Day Celebrations

Hyderabad Traffic: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపు

HT Telugu Desk HT Telugu
Jun 02, 2023 08:18 AM IST

Hyderabad Traffic: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. సచివాలయ పరిసర ప్రాంతాలతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో మధ్యామ్నం రెండు గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి.

హైదరాబాద్‌‌లో నేడు ట్రాఫిక్ మళ్లింపు
హైదరాబాద్‌‌లో నేడు ట్రాఫిక్ మళ్లింపు

Hyderabad Traffic: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది . ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

హైదరాబాద్‌లో పలు రూట్లలో వాహనాలను దారి మళ్లించనున్నారు. ఎన్టీఆర్‌ గార్డెన్‌, ఎన్టీఆర్‌ ఘాట్‌, నెక్లెస్‌ రోడ్డు, లుంబినీ పార్కులను నేడు మూసి వేయనున్నారు. సచివాలయంలో నిర్వహించనున్న వేడుకల సందర్భంగా సెక్రటేరియట్, గన్‌పార్కు పరిసరాల్లోని ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ రద్దీ ఉండే అవకాశాలుండటంతో ఆ మార్గాల్లో నిర్ణీత కాలంలో రాకపోకలు సాగించకుండా వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని అధికారులు సూచించారు.

అమరవీరుల స్తూపం వద్ద..

అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద కూడా ముఖ్యమంత్రి నివాళులు అర్పిస్తారు. ఈ సందర్భంగా ఆ మార్గంలో ప్రయాణించే వాహనాల రాకపోకలు కొద్దిసేపు నిలిపి వేయనున్నారు. పంజాగుట్ట నుంచి రాజ్‌భవన్‌ వైపు, సోమాజిగూడ నుంచి వీవీ విగ్రహం వైపు, అయోధ్య నుంచి నిరంకారి, రవీంద్ర భారతి నుంచి ఇక్బాల్‌ మినార్‌, ఇక్బాల్‌ మినార్‌ నుంచి ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌, ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌ నుంచి రవీంద్రభారతి, ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌ నుంచి ఇక్బాల్‌ మినార్‌ వైపు, బీజేఆర్‌ విగ్రహం, నాంపల్లి వైపు నుంచి రవీంద్రభారతి, పీసీఆర్‌ జంక్షన్‌, బషీర్‌బాగ్‌ జంక్షన్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను కొద్ది సేపు నిలిపివేస్తారు.

ఆ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

వీవీ నరసింహరావు విగ్రహం, నెక్లెస్‌ రోటరీ, ఎన్టీఆర్‌ మార్గ్‌, తెలుగుతల్లి జంక్షన్‌ వరకు ఇరువైపులా ట్రాఫిక్‌ అనుమతించరు. ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌పైకి వచ్చే వాహనాలను వీవీ విగ్రహం వద్ద నుంచి షాదన్ కాలేజీ వైపు మళ్లిస్తారు. వీవీఐపీ రాకపోకల సందర్భంగా షాదన్‌ కాలేజీ నుంచి సోమాజిగూడ రూట్‌లో ట్రాఫిక్‌ను కొంతసేపు ఆపుతారు.

ఇక్బాల్‌మినార్‌ జంక్షన్‌ నుంచి ట్యాంక్‌బండ్‌పైకి వాహనాల అనుమతించరు. ఈ వాహనాలను తెలుగుతల్లి జంక్షన్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వద్ద మళ్లిస్తారు. అలాగే, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ నుంచి కట్టమైసమ్మ జం క్షన్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు మళ్లిస్తారు.

అఫ్టల్‌గంజ్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే ఆర్టీసీ బస్సులు ట్యాంక్‌బండ్‌పై కాకుండా తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, కట్టమైసమ్మ ఆలయం, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కవాడిగూడ మీదుగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.

ట్యాంక్‌బండ్‌, తెలుగుతల్లి జంక్షన్‌ మీదుగా ఎన్టీఆర్‌మార్గ్‌కు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌ వైపు మళ్లిస్తారు.

బీఆర్‌కేఆర్‌ భవన్‌ నుంచి ఎన్టీఆర్‌మార్గ్‌ రూట్‌లోకి వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌ వైపు మళ్లిస్తారు.

బడా గణేశ్‌ లేన్‌ వైపు నుంచి ఐమాక్స్‌, నెక్లెస్‌ రోటరీ నుంచి మింట్‌ కంపౌండ్‌ వెళ్లే వాహనాలను రాజ్‌దూత్‌ లేన్‌లోకి మళ్లిస్తారు.

మింట్‌లేన్‌ నుంచి బడాగణేశ్‌ రూట్‌లో అనుమతించరు. ఈ వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వైపు మళ్లిస్తారు.

WhatsApp channel