నాలుగైదు రోజులపాటు తెలంగాణలో వర్షాలు..
హైదరాబాద్: అసని ప్రభావంతో రాబోయే 4-5 రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు.
రానున్న రెండు రోజుల్లో మాత్రం తెలంగాణలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని డైరెక్టర్ నాగర్నత తెలిపారు.
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సీనియర్ శాస్త్రవేత్త ఆర్‌కె జెనామణి సోమవారం మాట్లాడుతూ తీవ్ర తుఫాను 'అసని' తీరానికి దూరంగా సముద్రం మీదుగా తిరిగి వచ్చే అవకాశం ఉందని, ఇది ఆంధ్రప్రదేశ్, ఒడిశా లేదా పశ్చిమ బెంగాల్ తీరాన్ని తాకదని తెలిపారు.
అసని ప్రభావంతో ఒడిశాలోని కొన్ని కోస్తా జిల్లాల్లో మే 10 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసింది.
మే 9-10 తేదీల్లో మధ్య బంగాళాఖాతం, మే 10-12 తేదీల్లో వాయువ్య బంగాళాఖాతం మీదుగా సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు.
తుపాను దృష్ట్యా కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) తన ఉద్యోగులను , విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తం చేసింది.
సైక్లోన్ అసని అనేది శ్రీలంకలో పెట్టిన పేరు. సింహళీలో దీని అర్థం 'కోపం'.
టాపిక్