Siddipet Crime : బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష - సీపీ శ్వేత
Siddipet Crime : బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిద్దిపేట సీపీ శ్వేత తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన నిందితులకు శిక్షలు పడ్డాయన్నారు.
Siddipet Crime : బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన వారి పైన కఠినమైన చర్యలు ఉంటాయని సిద్దిపేట పోలీసు కమిషనర్ ఎన్. శ్వేత ప్రకటించారు. జిల్లాలో బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన ఒక వ్యక్తికి తహసీల్దార్ ఏడాది జైలు శిక్ష విధించారని తెలిపారు. మర్కుక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాములపర్తి గ్రామానికి చెందిన మ్యాకల రమేష్(38)కు ఒక సంవత్సరం జైలు శిక్ష పడిందని తెలిపారు. జిల్లాలో బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన మరొక వ్యక్తికి తహసీల్దార్ రూ.50 వేల జరిమానా విధించారని కమిషనర్ తెలిపారు. మద్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సాయపల్లి గ్రామానికి చెందిన బద్దిపడగ కృష్ణారెడ్డి(40) రూ.50 వేల జరిమానా విధించారన్నారు.
పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత మాట్లాడుతూ.. నిందితుడు మ్యాకల రమేష్ పై గతంలో కేసులు ఉన్నాయన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున మర్కుక్ ఎస్ఐ శంకర్ ఈ నెల 15న నేరస్థుడిని మర్కుక్ తహసీల్దార్ ముందు బైండ్ఓవర్ చేశారు. సంవత్సరం వరకు బైండోవర్ నిబంధనలు అమల్లో ఉన్నందున అట్టి నిబంధనలు ఉల్లంఘించినందుకు మర్కుక్ తహసిల్దార్ విచారణ జరిపి ఏడాది జైలు శిక్ష విధించారన్నారు.
మరొక వ్యక్తికి 50 వేల జరిమానా
బద్దిపడగ కృష్ణారెడ్డి పై గతంలో కేసులు ఉన్నాయి. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున మద్దూర్ ఎస్ఐ షేక్ యూసుఫ్ అహ్మద్ అలీ గతంతో నేరస్తుడిని మద్దూర్ తహసీల్దార్ ముందు బైండవర్ చేశారు. నిందితుడు బైండవర్ నిబంధనలు ఒక సంవత్సరం వరకు అమల్లో ఉన్నందున నిబంధనలు ఉల్లంఘించడంతో తహసీల్దార్ విచారణ చేసి 50 వేల రూపాయల జరిమానా విధించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ... నేరస్థులు, రౌడీలు, కేడీలు, డీసీలు, సస్పెక్ట్ మంచి ప్రవర్తనతో మెలగాలని వారితో పాటు వివిధ కేసులలో బైండ్ ఓవర్ అయిన ఎవరైనా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత హెచ్చరించారు. జిల్లాలో 1215 కేసులలో, 2,603 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు.