Palm Oil Factory : సిద్దిపేట జిల్లాలో పామాయిల్‌ ఫ్యాక్టరీ - 2 వేల మందికి ఉపాధి అవకాశాలు-palm oil factory in siddipet district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Palm Oil Factory : సిద్దిపేట జిల్లాలో పామాయిల్‌ ఫ్యాక్టరీ - 2 వేల మందికి ఉపాధి అవకాశాలు

Palm Oil Factory : సిద్దిపేట జిల్లాలో పామాయిల్‌ ఫ్యాక్టరీ - 2 వేల మందికి ఉపాధి అవకాశాలు

HT Telugu Desk HT Telugu
Oct 01, 2023 07:50 AM IST

Palm Oil Factory in Siddipet: సిద్ధిపేట గడ్డపై ఆయిల్ ఫామ్ కర్మాగారం ఏర్పాటు కాబోతుంది. ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ ఫ్యాక్టరీతో 2 వేల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి.

సిద్ధిపేటలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ
సిద్ధిపేటలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ

Palm Oil Factory in Siddipet: సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో 65ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ కర్మాగారం ఏర్పాటు కాబోతుంది.300కోట్లతో దీన్ని పూర్తి చేయనున్నారు. ఈ ఫ్యాక్టరీతో 2 వేల మందికి ఉపాధి అవకాశాలు దొరకనున్నాయి. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించే అవకాశం ఉన్న ఆయిల్ ఫామ్ తోటల సాగు చేయడానికి సిద్దిపేట జిల్లా రైతులు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో… సిద్దిపేట జిల్లాలో 50 వేల ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు కు లక్ష్యంగా పనిచేస్తున్నారు. మంత్రి హరీశ్ రావు ఎప్పటికప్పుడు సాగు పెంపు పై ప్రత్యేక దృష్టి సారించారు. గత రెండేళ్ల క్రితమే సాగుకు శ్రీకారం చుట్టారు.ఇప్పటికే జిల్లాలో 3వేల మంది రైతులు 11వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు.

గత సంవత్సరంలొనే ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు కు శంకుస్థాపన చేసారు.శనివారం రోజు పనులు ప్రారంభించడానికి మంత్రి హరీష్ రావు భూమి పూజ చేశారు.ఈ నిర్మాణ పనులను 18నెలల లోపు పూర్తి చేయాలనీ మంత్రి అధికారులకు గడువు విధించారు. ఆయిల్ ఫామ్ ను ప్రోత్సాహించే దిశగా మంత్రి హరీష్ రావు రైతుల కు అవగాహన, ఆత్మవిశ్వాసం పెంచేలా ఖమ్మం జిల్లా లోని అశ్వరావు పేటకు, దాదాపు 100 గ్రామాలు , 2వేల మంది రైతులను సందర్శనకు పంపించారు. దీంతో రైతుల్లో నమ్మకం పెరిగి ఆయిల్ ఫామ్ సాగుపై ఆసక్తి చూపారు. వరి, మొక్క జొన్న, పత్తి పంటలే తప్ప ప్రత్యామ్నాయం లేని ప్రాంతంగా ముద్రపడిన సిద్దిపేట నేలపై కొత్త శఖానికి నాంది పడినట్లు అయింది.

సిద్ధంగా పది లక్షల మొక్కలు…

ఈ ఏడాది 14 వేల ఎకరాలలో పంట సాగునీ పెంచాలని లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే 3 వేల ఎకరాల్లో మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉంచారు. జిల్లాలో ఉన్న మూడు నర్సరీల్లో 10లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి అని అధికారులు తెలిపారు . మరో 18 వేల ఎకరాలకు సరిపడా మొక్కలు సిద్దంగా ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక కొత్త జిల్లాలో తొలి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ సిద్దిపేట లొనే నిర్మాణం కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం లో రెండు ఫ్యాక్టరీ లు తెలంగాణ ఏర్పాటు కాకముందు నిర్మాణం చేశారు. సిద్దిపేట నిర్మాణం చేయనున్న ఆయిల్ పామ్ కర్మాగారంలో గేలల నుంచి ముడి నూనె తీయటంతో పాటు రిఫైండ్ అయిల్ ను సైతం ఇక్కడే ఉత్పత్తి చేసేలా మోడ్రన్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు.

రిపోర్టర్ : ఉమ్మడి మెదక్ జిల్లా

Whats_app_banner