Jagityala Death: హెడ్ కానిస్టేబుల్ భర్త సజీవ దహనం... జగిత్యాల జిల్లాలో దారుణం-tragedy in jagityla district constable husband burnt alive ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jagityala Death: హెడ్ కానిస్టేబుల్ భర్త సజీవ దహనం... జగిత్యాల జిల్లాలో దారుణం

Jagityala Death: హెడ్ కానిస్టేబుల్ భర్త సజీవ దహనం... జగిత్యాల జిల్లాలో దారుణం

HT Telugu Desk HT Telugu
Dec 13, 2024 06:00 AM IST

Jagityala Death: జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒంటరిగా ఇంట్లో నిద్రపోయిన వ్యక్తి సజీవదహనం అయ్యాడు. కాలి బూడిదైన వ్యక్తి మహిళ హెడ్ కానిస్టేబుల్ భర్త కావడం సంచలనం గా మారింది.

జగిత్యాలలో కానిస్టేబుల్ భర్త సజీవ దహనం
జగిత్యాలలో కానిస్టేబుల్ భర్త సజీవ దహనం

Jagityala Death: జగిత్యాల జిల్లా మల్యాల మండలం మ్యాడంపల్లి లో నివాసం ఉండే తిరుపతి సజీవ దహనం అయ్యాడు. తిరుపతికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య హెడ్ కానిస్టేబుల్ కావడంతో కొడిమ్యాల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు. గ్రామంలో వ్యవసాయ పనులతో పాటు ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసే తిరుపతి ఒంటరిగా ఉంటున్నాడు.

yearly horoscope entry point

రాత్రి పడుకున్న తిరుపతి ఇళ్ళు దగ్ధమై సజీవ దహనం అయ్యారు. ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలను చూసి స్థానికులు ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇవ్వగా అగ్ని మాపక సిబ్బంది వచ్చేలోగా ఇళ్ళు పూర్తిగా ఖాళీ కూలిపోయింది. అందులో ఉన్న తిరుపతి సజీవ దహనం అయ్యారు.

షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమా?

తిరుపతి నివాసం ఉంటున్న ఇల్లు దగ్ధమై సజీవ దహనం కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి సజీవ దహనం అయినట్లు స్థానికులు భావిస్తున్నారు.‌ భార్య పిల్లలు ఉండగా ఒక్కడే ఇంట్లో ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. విధి నిర్వహణలో భార్య పిల్లలతో ఉండగా గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తూ డ్రైవర్ గా జీవనం సాగిస్తూ తిరుపతి ఒక్కడే ఉంటున్నాడని స్థానికులు తెలిపారు.‌

మద్యం తాగే అలవాటు ఉండడంతో రాత్రి మద్యం తాగి ఇంట్లో పడుకోవడంతో షార్ట్ సర్క్యూట్ మంటలు చెలరేగి పెంకుటిల్లు దగ్ధమై గాఢ నిద్రలో ఉన్న తిరుపతి ఆ మంటల్లోనే సంజీవ దహనం అయినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

విచారణ చేపట్టిన పోలీసులు...

ఇల్లు దగ్ధమై మహిళ హెడ్ కానిస్టేబుల్ భర్త తిరుపతి సజీవ వాహనం కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులు తమకు ఎలాంటి అనుమానాలు లేవని.. కరెంటు షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి ఆ మంటల్లో తిరుపతి చిక్కుకుని సజీవ దహనం అయినట్లు బార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నిజంగానే కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి సజీవ దహనం అయ్యాడా లేక ఒంటరిగా ఉంటున్న తిరుపతి మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner