రేవంత్ రెడ్డి టీడీపీ కోవర్ట్.. సంస్కార హీనుడు: మంత్రి జగదీష్ రెడ్డి-minister jagadish reddy counters to revanth reddy comments on cm kcr ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  రేవంత్ రెడ్డి టీడీపీ కోవర్ట్.. సంస్కార హీనుడు: మంత్రి జగదీష్ రెడ్డి

రేవంత్ రెడ్డి టీడీపీ కోవర్ట్.. సంస్కార హీనుడు: మంత్రి జగదీష్ రెడ్డి

Manda Vikas HT Telugu
Feb 16, 2022 02:57 PM IST

సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. అలాగే కేసీఆర్ మోదీ కోవర్ట్ అని రేవంత్ చేసిన కమెంట్లకు కూడా బదులిస్తూ రేవంత్ రెడ్డి ఇప్పటికీ టీడీపీ కోవర్ట్ అని మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Telangana Minister Jagadish Reddy
Telangana Minister Jagadish Reddy (FB)

Hyderabad | సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను హేళన చేసేలా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమని మంత్రి అన్నారు. 'జన్మదిన వేడుకలు కాదు.. తద్దినం పెట్టాలి' అంటూ రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం అతడి సంస్కారాన్ని తెలియజేస్తుంది. సంస్కార హీనులు మాత్రమే అలా మాట్లాడతారని జగదీష్ అన్నారు. అలాగే కేసీఆర్ మోదీ కోవర్ట్ అని రేవంత్ చేసిన కమెంట్లకు కూడా బదులిస్తూ రేవంత్ రెడ్డి ఇప్పటికీ టీడీపీ కోవర్ట్ అని ఆయన కౌంటర్ ఇచ్చారు.

మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక బీజేపీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యల్ని రాజకీయలకతీతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించారు. అలాంటి సంస్కారం కేసీఆర్‌ది. కానీ జన్మదిన వేడుకలను తద్దినాలుగా జరపాలని చెప్పే నీచ సంస్కృతి రేవంత్‌ది అని మంత్రి తూర్పారబట్టారు. హేమంత్ బిస్వాస్ కంటే రేవంత్ మరింత సంస్కారా హీనుడని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ పార్టీకి తద్దినం పెట్టేందుకే రేవంత్ తమ పార్టీలో చేరారని సొంత పార్టీ నేతలే అంటున్నారని మంత్రి జగదీష్ పేర్కొన్నారు. ఉద్యమంలో కుట్రలు చేసినోళ్లకు, తెలంగాణ ద్రోహులకు మూటలు మోసిన చరిత్ర రేవంత్‌ది అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేత కాదని, టీడీపీ కోవర్ట్ అని మంత్రి కౌంటర్ ఇచ్చారు.

 

IPL_Entry_Point