Rythu Bima : రైతులకు అలర్ట్... రైతు బీమా దరఖాస్తులకు అవకాశం, ఎప్పటివరకంటే-last date for rythu bhima registration is august 5 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rythu Bima : రైతులకు అలర్ట్... రైతు బీమా దరఖాస్తులకు అవకాశం, ఎప్పటివరకంటే

Rythu Bima : రైతులకు అలర్ట్... రైతు బీమా దరఖాస్తులకు అవకాశం, ఎప్పటివరకంటే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 12, 2023 12:09 PM IST

Rythu Bima Registrations: రైతు బీమాకు దరఖాస్తులకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది వ్యవసాయశాఖ. రైతుబీమా పథకాన్ని మరో ఏడాది పొడిగించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అర్హులైన వారిని ఆగస్టు 5 లోపు బీమా పథకంలో నమోదు చేయాలని సర్కార్ ఆదేశించింది.

రైతుబీమా
రైతుబీమా

Rythu Bima Farmer Insurance Scheme:ఇటీవలే రైతుబంధు నిధులను చేసింది తెలంగాణ సర్కార్. కొత్త వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. రైతులు మరణించినపుడు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక చేదోడు కల్పించే రైతుబీమా పథకాన్ని మరో ఏడాది పొడిగించేలా అడుగులు వేస్తోంది. గతంలో ఉన్న వారి పాలసీలను రెన్యూవల్ చేయటంతో పాటు.... కొత్తగా అర్హులైన రైతులకు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు డెడ్ లైన్ కూడా ప్రకటించింది.

కొత్తగా అర్హులైన రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 10న ఈ ప్రక్రియ ప్రారంభంకాగా.... ఆగస్టు 5 లోపు బీమా పథకంలో నమోదు చేయాలని అధికారులను సర్కార్ ఆదేశించారు. ఫలితంగా కొత్తగా పాస్ బుక్ వచ్చిన రైతులు కూడా... ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంలో నమోదైన రైతు ఏ కారణంతో మృతి చెందినా బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా సొమ్మును అందిస్తోంది. తొలి ఏడాదిలో ప్రతి రైతు పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఐసీకి రూ.2,271 చొప్పున చెల్లించగా గతేడాది.... రూ.3,556 చొప్పున చెల్లించింది.

అర్హతలు:

-18 ఏళ్లు నిండి 60 ఏళ్లలోపు వయసున్నవారు మాత్రమే పథకంలో నమోదుకు అర్హులుగా ఉంటారు.

-ప్రస్తుతం వయసు నిండినవారిని, చనిపోయినవారి పేర్లను పథకంలోనుంచి తొలగించి నూతనంగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందినవారివి చేరుస్తున్నారు.

- ఇప్పటికే ఈ పథకంలో నమోదైనవారు నూతనంగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు.

- జూన్‌ 18 వరకు పట్టాదారు పాసుపుస్తకాలు పొందినవారిని అర్హులుగా పరిగణిస్తారు.

- ఏఈవోల వద్ద ఆయా గ్రామాల జాబితాలుండగా పేరు నమోదుచేసే రైతు స్థానికంగా ఉండాలి. - -

- పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు ఖాతా, రైతుతోపాటు నామినీ ఆధార్‌కార్డుల నకలు ప్రతులను, నామినీ నమోదు పత్రాన్ని పూరించి ఏఈవోలకు ఇవ్వాలి.

చట్టపరమైన వారసత్వం కలిగినవారు నామినీగా ఉండాలి. గతంలో పథకంలోని రైతుల పేరిట నమోదైన నామినీ చనిపోతే నామినీ పేరు మార్పునకు అవకాశం ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం