KISAN Agri Show at Hyderabad: దేశంలోనే అతిపెద్ద 'కిసాన్ అగ్రి షో ' ప్రారంభం-kisan agri show 2023 begins in hyderabadcheck full details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Kisan Agri Show 2023 Begins In Hyderabadcheck Full Details

KISAN Agri Show at Hyderabad: దేశంలోనే అతిపెద్ద 'కిసాన్ అగ్రి షో ' ప్రారంభం

HT Telugu Desk HT Telugu
Mar 03, 2023 03:57 PM IST

KISAN Agri Show Hyderabad Updates:హైదరాబాద్ లో భారతదేశ అతిపెద్ద కిసాన్ అగ్రి షో ను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారభించారు. ఈ షోలో దేశం నలుమూలలకు చెందిన 150కి పైగా ఎగ్జిబిటర్లు, 30 వేల మంది సందర్శకులు పాల్గొననున్నారు.

కిసాన్ అగ్రిషో
కిసాన్ అగ్రిషో

KISAN Agri Show in Hyderabad: దేశంలోనే అతిపెద్ద ఆగ్రి షో “కిసాన్“ కు హైదరాబాద్​కు వేదికైంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. హైదరాబాద్​లోని​ హైటెక్స్​ వేదికగా మార్చి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఈ షో జరగనున్నది. ఇప్పటికే ఈ ఆగ్రి షో చాలా సార్లు విజయవంతం కాగా, ఈసారి నిర్వహించడం 32వసారి. ఈ ‘‘కిసాన్​’’ ఆగ్రి షో ఎగ్జిబిషన్​ రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీక్షకులకు అందుబాటులో ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

అగ్రి స్టార్టప్స్ కోసం ప్రత్యేక విభాగమైన స్పార్క్:

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్), రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీల క్లస్టర్ జ్ఞాన కేంద్రం, గణనీయ సంఖ్యలో పాల్గొన్న పలు ప్రధాన పరిశ్రమలు ఈ షో కు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. ఈ 3 రోజుల కార్యక్రమంలో 150కి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటారు. ఈ ఎగ్జిబిషన్ 12,000 చ.మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ వేదిక ద్వారా 160కి పైగా కంపెనీలు అనుసంధానం కాగలవని అంచనా. తెలంగాణ, పరిసర రాష్ట్రాల నుంచి 30,000కు పైగా సందర్శకులు రాగలరని నిర్వాహకులు భావిస్తున్నారు.

ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘హైదరాబాద్ లో ఇంత భారీ స్థాయిలో అగ్రి ఎక్స్ పో జరగడం ఇదే మొదటిసారి. వ్యవసాయంలో వివిధ రకాల యంత్రాలు, వినూత్న ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. వీటన్నింటినీ చూస్తుంటే, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ కచ్చితంగా వ్యవసాయ పరిశ్రమల్లో ఒక మార్పు తీసుకురాగలదని అనిపిస్తోంది. ఈ ప్రదర్శన వినూత్నతల ఆవిష్కర్తలకు మాత్రమే గాకుండా రైతులకు కూడా ఎంతో ఉపయోగపడాలని ఆశిస్తున్నాం’’ అని చెప్పారు.

కిసాన్ ఫోరమ్ ప్రై.లి. కన్వీనర్ శ్రీ నిరంజన్ దేశ్ పాండే ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘హైదరాబాద్ లో ఈ తరహా భారీ వ్యవసాయ ప్రదర్శన నిర్వహించడం ఆనందదాయకం. ఈ ప్రదర్శనను ప్రారంభిస్తున్నందుకు గాను తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఆవిష్కర్తలు వ్యవసాయరంగంలో నూతన సాంకేతికతలను నిర్మించేందుకు ఈ ప్రదర్శన బాట వేయగలదని విశ్వసిస్తున్నాం. ఇక్కడ ప్రదర్శించ బడుతున్న సాంకేతికతలు రాష్ట్రంలో, అదే విధంగా దేశంలోని రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి’’ అని అన్నారు.

స్టార్టప్స్ అండ్ టెక్నాలజీ:

వినూత్న ఆలోచనలను ప్రదర్శించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఒక పెవిలియన్ ను స్పార్క్ పేరుతో ఏర్పాటుతో ఈ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేశారు. మొబైల్ ఫోన్లు విస్తృతంగా వాడుకలోకి రావడం, డిజిటల్ ఇండియా కార్యక్రమాలు రైతులకు సాధికారికత కల్పిస్తున్నా యి. 20కిపైగా అగ్రి స్టార్టప్స్ నూతన సాంకేతికతలను, భావాలను ఇక్కడ ప్రదర్శించాయి. జ్ఞాన కేంద్రం వద్ద నుంచి... రైతులు తెలంగాణకు పనికొచ్చే నూతన సాంకేతికతలు, వినూత్నతల గురించి సమాచారాన్ని పొందవచ్చు. వ్యవసాయరంగంలో చోటు చేసుకుంటున్న అధునాతన సాంకేతిక పరిణామాల గురించి కూడా కిసాన్ ప్రదర్శిస్తోంది. అనుసరించేందుకు సిద్ధంగా ఉన్న వినూత్న మెకానిజంలు త్వరలోనే మార్కెట్ లోకి ప్రవేశపెట్టబడేందుకు సిద్ధంగా ఉన్నాయని శ్రీ దేశ్ పాండే అన్నారు.

మొత్తం మీద కిసాన్ ప్రదర్శన అగ్రి ఇన్ పుట్, నీటి నిర్వహణ, పరికరాలు, ఉపకరణాలు, విత్తనాలు, ప్లాంటింగ్ మెటీరియల్ లపై దృష్టి సారించింది. ‘ఓపెన్ ఏరియా’లో భారీ మెషినరీ, ఉపకరణాలు ప్రదర్శించబడుతాయి. రైతులు ప్రత్యేకించి భారతీయ శీతోష్ణస్థితి తగినట్లుగా వృద్ధి చేయబడిన ఎన్నో వినూత్న ఫామ్ సాంకేతికతలను ఇక్కడ చూడగలుగుతారు.

WhatsApp channel