Drugs | పైకి చూడ ప్రయాణికులైయుండును.. పొట్ట విప్పి చూడ డ్రగ్స్ ఉండు-hyderabad customs seize drugs worth rs 12 crore from one passenger ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Drugs | పైకి చూడ ప్రయాణికులైయుండును.. పొట్ట విప్పి చూడ డ్రగ్స్ ఉండు

Drugs | పైకి చూడ ప్రయాణికులైయుండును.. పొట్ట విప్పి చూడ డ్రగ్స్ ఉండు

HT Telugu Desk HT Telugu
May 05, 2022 11:34 AM IST

ఈ మధ్యకాలంలో హైదరాబాద్ లో డ్రగ్స్ ఎక్కువగా పట్టుబడుతున్నాయి. కిందటి నెల పట్టుకున్న ఓ వ్యక్తి కడుపులో డ్రగ్స్ క్యాప్సుల్స్ పెట్టుకుని వచ్చినట్టుగా తాజాగా అధికారులు ప్రకటించారు.

<p>డ్రగ్స్ క్యాప్సుల్స్</p>
డ్రగ్స్ క్యాప్సుల్స్

హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మాదక ద్రవ్యాల రవాణ గుట్టురట్టు చేశారు అధికారులు. టాంజానియా దేశస్థుడి నుంచి రూ.11.53 కోట్ల విలువైన హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాలను క్యాప్సుల్స్‌ రూపంలో ప్యాక్‌ చేసి, కడుపులో దాచుకుని స్మగ్లింగ్‌ చేస్తున్న అతడిపై అనుమానం వచ్చి పోలీసులు విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

రెండు వారాల వ్యవధిలో హైదరాబాద్‌లో హెరాయిన్‌ నాలుగుసార్లు పట్టుబడింది. కిందటి నెల 21న టాంజానియాకు చెందిన వ్యక్తిని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు పట్టుకుని.. రూ.11.57 కోట్ల విలువైన కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. అదే నెలలో 26వ తారిఖున టాంజానియాకు చెందిన మరో వ్యక్తి సైతం అధికారులు పట్టుకున్నారు.

టంజానియాకు చెందిన వ్యక్తి.. అబుదాబి మీదుగా హైదరాబాద్ వచ్చాడు. ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల జాబితాను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. గతనెల 26వ తేదీన కూడా అలాగే పరిశీలించారు. టాంజానియాకు చెందిన వ్యక్తిపై అనుమానం కలిగింది. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో అతడిని పట్టుకుని ప్రశ్నించారు. తనకు డ్రగ్స్ క్యాప్సుల్స్ కడుపులో పెట్టి పంపించారని అతడు ఒప్పుకున్నాడు. టూరిస్ట్ వీసా ఇచ్చినట్టుగా వెల్లడించాడు రెండు మూడు రోజుల్లో రిసీవర్లు వచ్చి.. క్యాప్సుల్స్ తీసుకుంటారని తెలిపాడు.

దీంతో వెంటనే.. కస్టమ్స్ అధికారులు అతడిని.. ఆసుపత్రికి తరలించారు. ఆరు రోజులపాటు ఆసుపత్రిలోనే ఉంచారు. డాక్టర్ల పర్యవేక్షణలో 108 క్యాప్సుల్స్‌ బయటకు వచ్చేలా చేశారు. మెుత్తం 1.38 కిలోల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. డ్రగ్స్‌ ఉత్తరాదికి తరలించేలా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. శంషాబాద్‌ విమానాశ్రయంలో 15 రోజుల్లో సుమారు రూ.113.47 కోట్ల విలువైన డ్రగ్స్‌ దొరికాయి.

Whats_app_banner