Rain in Hyderabad: నగరంలో మరోసారి భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం
Hyderabad Rains: భాగ్య నగరాన్ని మరోసారి వర్షం ముంచెత్తింది. శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయ్యాయి.
Rains in Hyderabad City: హైదరాబాద్ నగరాన్ని వరణుడు వీడటం లేదు. కొద్దిరోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. శనివారం సాయంత్రం కూడా భారీ వర్షం కురిసింది. ఫలితంగా జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే నగర ప్రజలు దసరా పండగ కోసం ఊళ్లకు వెళ్లారు. అయితే తిరిగి నగరానికి వచ్చే క్రమంలో వర్షం దాటికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
హైదర్‌నగర్, అల్విన్‌కాలనీ, నిజాంపేట్, ప్రగతినగర్, రాజేంద్రనగర్, కిస్మత్‌పూర్, గండిపేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మియాపూర్, శేరిలింగంపల్లి, మాదాపూర్, రాయదుర్గం, కూకట్‌పల్లి, అల్వాల్, చిలకలగూడ ఉప్పరపల్లి, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, బేగంపేట్ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఫలితంగా రోడ్లన్నీ జలమయంగా మారాయి. ఇక కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం బయటికి వచ్చిన ప్రజలు తడిసి ముద్దయ్యారు. రహదారులపై వరద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా మంది ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయించారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద భారీగా వర్షపు నీరు నిలిచింది.
మరో మూడు నాలుగు రోజుల కూడా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. పలుప్రాంతాల్లో ఉరుమలు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.
సాగర్ గేట్లు ఎత్తివేత….
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి 2 లక్షలకు పైగా క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. దీంతో 20 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1.63 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. నాగార్జున సాగర్ జలాశయం కుడి, ఎడమ కాల్వకు సాగు నీరు 16 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం జలశయానికి కూడా వరద కొనసాగుతోంది.
సంబంధిత కథనం