Hussain Sagar : వామ్మో ఇది చరిత్రే.. ఆ రోజు హుస్సేన్‌సాగర్‌ బోటింగ్ ఆదాయం రూ.9.5 లక్షలు-boating in hussainsagar fetches rs 9 5 lakh on independence day ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Boating In Hussainsagar Fetches Rs.9.5 Lakh On Independence Day

Hussain Sagar : వామ్మో ఇది చరిత్రే.. ఆ రోజు హుస్సేన్‌సాగర్‌ బోటింగ్ ఆదాయం రూ.9.5 లక్షలు

Anand Sai HT Telugu
Aug 17, 2022 02:54 PM IST

ట్యాంక్ బండ్ మీదకు వెళ్తే హుస్సేన్ సాగర్ లోని బుద్ధుడికి హాయ్ చెప్పి రావాలనిపిస్తుంది. పిల్లలను తీసుకొళ్తే బోటింగ్.. బోటింగ్ అంటూ మారం చేస్తారు. అయితే అక్కడ బోటింగ్ ఆదాయం వారంతాల్లో రూ.2లక్షలు రావడమే ఎక్కువ. సాధారణ రోజుల్లో చాలా తక్కువ. కానీ ఒక్క రోజులోనే రూ.9.5 లక్షల ఆదాయం వచ్చింది తెలుసా?

హుస్సేన్ సాగర్
హుస్సేన్ సాగర్ (twitter)

హుస్సేన్‌సాగర్‌లో బోటింగ్ సేవలు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రికార్డు సృష్టించాయి. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక్కరోజులోనే ఆదాయం వచ్చిందని పర్యాటక శాఖ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలలో పాల్గొనడానికి వచ్చిన వేలాది మంది సందర్శకులు సరస్సు మధ్యలో ఉన్న బుద్ధుని విగ్రహం చుట్టూ ఆనందంగా గడిపారు. సాధారణ రోజులు, వారాంతాల్లో బోటింగ్ ద్వారా సగటున వసూళ్లు రూ.2 లక్షల వరకు ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు

1994 నుంచి సరస్సు ఒడ్డున ఉన్న లుంబినీ పార్క్ నుంచి పర్యాటకుల కోసం అనేక బోట్ సేవలను అందిస్తున్నాయి. హైదరాబాద్ పర్యాటక ప్రాంతాల్లో హుస్సేన్‌సాగర్ ది ప్రత్యేక పాత్ర. రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత.. తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పర్యాటకాన్ని మరింత ప్రొత్సహించింది. హుస్సేన్ సాగర్ వద్దకు పర్యాటకులు వచ్చేలా ఎప్పటికప్పుడు ప్రణాళికలు వేస్తూ ముందుగు సాగుతోంది.

అయితే ఈసారి బోట్ రైడ్‌లు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అదనపు ఉత్సాహాన్ని ఇచ్చాయి. కొంతమంది సందర్శకులు బుద్ధ విగ్రహాన్ని దగ్గరగా చూసేందుకు వెళ్తే.. మరికొంతమంది బోటింగ్ సరదాగా ఆనందించారు. సరస్సులో సేవలను అందించే బోట్‌లలో ఖైరున్నీసా ప్రధానమైన పెద్ద పడవ, భాగమతి, రాజహంస, అనేక స్పీడ్ బోట్లు ఉన్నాయి. ఈసారి స్వాతంత్య్ర వేడుకల్లో ఎవరూ ఊహించని విధంగా ఆదాయం వచ్చింది.

'బోటింగ్ ప్రారంభించినప్పటి నుండి హుస్సేన్‌సాగర్ సరస్సు వద్ద ఇది అత్యధిక ఆదాయం. ఆగస్టు 15న 9.5 లక్షలు వసూలు చేశాం. లాక్‌డౌన్‌కు ముందు 9.2 లక్షలు వసూలు చేయడం మునుపటి రికార్డు. సాధారణంగా సెలవు దినాల్లో, టూరిస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు రూ. 5 లక్షలు, సాధారణ రోజుల్లో రూ. 2 లక్షల ఆదాయం వస్తుంది. ఒకే రోజు ఈ భారీ వసూళ్లు మా అధికారులను ఆశ్చర్యపరిచాయి. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం వరుస కార్యక్రమాలను నిర్వహించడమే కారణం.' అని TSTDC మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ అన్నారు.

IPL_Entry_Point