BC Overseas Vidya Nidhi : 'బీసీ విదేశీ విద్యానిధి' పథకం… దరఖాస్తుల గడువు పెంపు-bc overseas vidya nidhi scholarship applications extended ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bc Overseas Vidya Nidhi : 'బీసీ విదేశీ విద్యానిధి' పథకం… దరఖాస్తుల గడువు పెంపు

BC Overseas Vidya Nidhi : 'బీసీ విదేశీ విద్యానిధి' పథకం… దరఖాస్తుల గడువు పెంపు

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 30, 2023 11:42 AM IST

BC Overseas Vidya Nidhi scholarship Updates : తెలంగాణలో బీసీ విద్యార్ధులకు అమలు చేస్తున్న విదేశీ విద్యానిధి పథకానికి సంబంధించి అప్డేట్ ఇచ్చారు అధికారులు. దరఖాస్తుల గడువును పెంచినట్లు బీసీ సంక్షేమ శాఖ తెలిపింది.

బీసీ విద్యానిధి పథకానికి దరఖాస్తుల గడువు పెంపు
బీసీ విద్యానిధి పథకానికి దరఖాస్తుల గడువు పెంపు

BC Overseas Vidya Nidhi scholarship: విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసాన్ని కొనసాగించాలనే బీసీ వర్గాలకు చెందిన పేద విద్యార్ధులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మహాత్మ జ్యోతిబాఫూలే విదేశీ విద్యానిధి పథకం ద్వారా 2023 సెప్టెంబర్‌ ఫాల్ సీజన్‌‌లో అడ్మిషన్లు పొందే బీసీ, ఈబీసీ విద్యార్ధులకు ఈ పథకం ద్వారా ఆర్ధిక సాయం అందించనున్నారు.

yearly horoscope entry point

ఫాల్‌సీజన్‌ అడ్మిషన్ల కోసం సిద్ధమవుతున్న బీసీ, ఈబీసీ విద్యార్ధులు జ్యోతిబాపూలే విదేశీ విద్యానిధి పథకం కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా బీసీ సంక్షేమ శాఖ ముఖ‌్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సూచించారు. తెలంగాణ ఈ పాస్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు https://telanganaepass.cgg.gov.in/OverseasLinks.do అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ఇక సెప్టెంబరు 30వ తేదీతో దరఖాస్తుల గడువు ముగియటంతో… బీసీ సంక్షేమ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అక్టోబరు 5వ తేదీ వరకు గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయసు 35ఏళ్లకు మించకూడదు. కుటుంబ వార్షికాదాయం రూ.5లక్షలను దాటకూడదు. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, ప్యూర్‌ సైన్స్‌, అగ్రికల్చర్‌ సైన్స్‌, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్‌ విభాగాల్లో కనీసం 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు విదేశీ విద్యానిధి ద్వారా సాయం పొందడానికి అర్హులుగా పేర్కొన్నారు.

విదేశీ యూనివర్శిటీలలో ప్రవేశాల కోసం ఐ 20 ఇన్విటేషన్‌ ఉన్నవారు, వీసాలు వచ్చినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్‌, యూకే, సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో ఉన్నత విద్యకు ఈ పథకం వర్తిస్తుంది.

ఈ పథకానికి ఎంపికైన విద్యార్ధులకు గరిష్టంగా 20లక్షల వరకు ఆర్ధిక సాయం అందిస్తారు. వీసా ఛార్జీలతో పాటు ఒకవైపు విమాన ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. కుటుంబంలో ఒక్కరికే మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. గ్రాడ్యుయేషన్‌లో 60శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు జిఆర్‌ఈ, జి మ్యాట్‌ స్కోర్‌లను పరిగణలోకి తీసుకుంటారు.

అభ్యర్థులు సాధించిన స్కోర్‌కు విదేశీ విద్యానిథి పధకంలో 20శాతం వెయిటేజీ ఉంటుంది. టోఫెల్, ఐఈఎల్టీఎస్‌, పిటిఇలకు 20శాతం ఇస్తారు. మెరిట్ లిస్ట్‌ ఎంపికలో స్కోర్‌ పరిగణలోకి తీసుకుంటారు. విదేశాల్లోఅడ్మిషన్‌ పొందే యూనివర్శిటీల్లో స్కోర్‌ పరిగణలోకి తీసుకోకపోయినా దరఖాస్తు సమయంలో మాత్రం వాటిని పేర్కొనాల్సి ఉంటుంది.

Whats_app_banner