Crime: చౌటుప్పల్ లో దారుణం.. మహిళపై అత్యాచారం, ఆపైగా హత్య-a woman raped and murdered at toopranpet in yadadri bhuvanagiri district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  A Woman Raped And Murdered At Toopranpet In Yadadri Bhuvanagiri District

Crime: చౌటుప్పల్ లో దారుణం.. మహిళపై అత్యాచారం, ఆపైగా హత్య

HT Telugu Desk HT Telugu
May 11, 2022 08:12 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళపై అత్యాచారం చేసి.. హత్య చేశారు. ఈ కేసులో 24 గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

గిరిజన మహిళపై హత్యాచారం
గిరిజన మహిళపై హత్యాచారం

woman raped and murdered at toopranpet: బతుకుదెరువు కోసం వారు వచ్చారు.. హైదరాబాద్‌-విజయవాడ హైవే సమీపంలోని ఒక గోదాము వద్ద కాపలాదారులుగా ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇదే సమయంలో భర్త.. ఓ కాలేజీలో సెక్యూరిటీ గార్డ్ గా కూడా పని చేస్తున్నాడు. ఈ సమయంలో భార్య ఒక్కరే ఇంట్లో ఉంటుంది. సీన్ కట్ చేస్తే ఆమెపై ఓ దుండగుడు అత్యాచారానికి దిగాడు. అపస్మారస్థితిలో వెళ్లాక కూడా మరోసారి లైంగిక దాడి చేయటంతో ఆమె ప్రాణాలు కోల్పోంది. పైగా ఆమెపై ఉన్న సోమ్ములను కూడా తీసుకెళ్లాడు. సోమవారం జరిగిన ఈ దారుణ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగు చూసింది.

ఏం జరిగిందంటే..

హత్యాచారానికి గురైన మహిళది నాగర్‌ కర్నూల్‌ జిల్లా. మార్చి నెలలో  ఆమె భర్తతో పాటు చౌటుప్పల్ మండల పరిధిలోని తూప్రాన్‌పేటకు వలస వచ్చారు. వారిద్దరూ హైదరాబాద్‌-విజయవాడ హైవే సమీపంలోని ఒక గోదాము వద్ద కాపలాదారులుగా ఉంటున్నారు. ఇక భర్త పగటివేళ దగ్గర్లోని ఓ కాలేజీలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. అయితే సోమవారం ఉదయం ఆయన విధులకు వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో భార్య కనిపించలేదు. చుట్టుపక్కల వెతకగా.. సమీపంలోని గడ్డివాము దగ్గర రక్తపు మడుగులో శవమై కనిపించింది. భర్త వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

నిందితుడు అరెస్ట్..

ఈ ఘటననపై ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. 24 గంటల్లోగా నిందితుడిని అరెస్ట్ చేశారు. మహిళపై అత్యాచారం చేసింది సంగారెడ్డి జిల్లాకు చెందిన యువకుడి(24)గా గుర్తించారు. అతడు తూప్రాన్‌పేటలోని ఓ సిమెంట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. పగటివేళ ఆ మహిళ ఒంటరిగా ఉంటోందని గమనించి అత్యాచారానికి తెగించినట్లు చౌటుప్పల్ పోలీసులు వెల్లడించారు. అయితే విషయం బయటకు వస్తుందన్న భయంతో నిందితుడు మహిళను చంపి ఉండవచ్చని భావిస్తున్నారు.

IPL_Entry_Point

టాపిక్