Study | రోడ్లపై ఈ టైమ్ చాలా డేంజర్.. ప్రమాదాలు తగ్గాలంటే..
హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ కొన్ని సమయాల్లో మాత్రం ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయట. దీనిపై అధ్యయనం కూడా చేశారు.
హైదరాబాద్ లో ట్రాఫిక్ లో ఇరుక్కుంటే తలతిరిగిపోతుంది. ఎలా బయటకు వెళ్లాలో అర్థం కాదు. ఇలాంటి సమయాల్లోనూ.. చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతాయి. దీనికంటే.. ఎక్కువగా.. వేరే సమయంలో ప్రమాదాలు జరుగుతాయని ఓ అధ్యయనంలో తేలింది. హైదరాబాద్ బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (బిట్స్) పిలానీ పరిశోధకులు ఏ సమయంలో ప్రమాదాలు జరుగుతాయో గుర్తించారు.
బిట్స్ పిలానీ పరిశోధకులు.. హైదరాబాద్ పోలీసుల నుంచి యాక్సిడెంట్ అయిన డేటాను సేకరించి విశ్లేషించారు. రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాలకు సంబంధించిన ప్రమాద కారకాలను ఆరు విభాగాలుగా వర్గీకరించారు. కూడళ్లలో పాదచారులకు సురక్షితమైన క్రాసింగ్ సదుపాయాన్ని కల్పించడం, రాత్రి సమయంలో రోడ్డు మార్గంలో తగినంత వెలుతురును అందించడంలాంటి పలు చర్యలను సూచించారు.
ఈ అధ్యయనంలో.. ప్రమాదం జరిగిన తేదీ, సమయం, ప్రదేశం, గాయాలు, మరణాల సంఖ్య, వాహనాల వివరాల వంటి సమాచారాన్ని 60 పోలీసు స్టేషన్ల నుండి సేకరించారు. 2015 నుండి 2019 మధ్య కాలంలో హైదరాబాద్‌లో అత్యధిక సంఖ్యలో ప్రమాదాలు జరిగినట్టుగా గుర్తించారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాల డేటాను తీసుకోలేదు. ఆ సమయంలో జనాలు రోడ్లపైకి కాస్త తక్కువగా వచ్చారు. దీంతో లెక్కలోకి తీసుకోలేదు.
ప్రమాద కారకాలను ఆరు రకాలుగా వర్గీకరించారు. చాలా ఎక్కువ ప్రమాదం, అధిక-ప్రమాదం, మితమైన ప్రమాదం, తక్కువ ప్రమాదం, చాలా తక్కువ-ప్రమాదం, అత్యంత తక్కువ-ప్రమాదం. ప్రమాద కారకాలలో భారీ వాహనాలు, పాదచారులు రోడ్డు దాటే సమయంలో చనిపోవడం, ఇతర నెమ్మదిగా కదిలే వాహనాల ద్వారా అధిక ప్రమాదాలు జరిగినట్టుగా అధ్యయనంలో తేలింది.
అయితే ఈ ప్రమాదాలు అన్నీ.. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు హైదరాబాద్ అంతటా ఎక్కువగా జరుగుతున్నాయని పరిశోధన చెప్పింది. ఇలాంటి ప్రమాదాలను తగ్గించేందుకు పరిశోధకులు పలు సూచనలు చేశారు. కూడళ్లలో సురక్షితమైన క్రాసింగ్ సౌకర్యం, జంక్షన్‌లలో సిగ్నల్స్, తగిన రహదారి గుర్తులు, ట్రాఫిక్ సంకేతాలు సరిగా ఉండాలి. కీలకమైన ప్రదేశాలలో పాదచారుల కాపలాదారులు జీబ్రా క్రాసింగ్ మీద నుంచి పాదచారుల నడవకుండా.. పక్క నుంచి నడుస్తున్నారు. ఇదే ప్రమాదాలకు ప్రధాన కారణం. రహదారి భద్రత గురించి భారీ వాహన డ్రైవర్లకు అవగాహన కల్పించాలి.
రాత్రి సమయంలో రోడ్డు మార్గంలో తగినంత వెలుతురు, స్పీడ్ తగ్గించే చర్యలను ఏర్పాటు చేయడం, రెట్రో-రిఫ్లెక్టివ్ పేవ్‌మెంట్ మార్కర్లను ఉపయోగించడం వంటి వాటితో ప్రమాదాలను నివారించొచ్చని పరిశోధనలో చెప్పారు.
టాపిక్