Yashasvi Jaiswal Irani Cup: ఇరానీ కప్‌లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ - 33 ఏళ్ల రికార్డ్ బ్రేక్
Yashasvi Jaiswal Irani Cup: ఇరానీ కప్‌లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో సత్తాచాటాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డ్‌ను నెలకొల్పాడు. ఆ రికార్డ్ ఏదంటే...
Yashasvi Jaiswal Irani Cup: ఇరానీ కప్‌లో డబుల్ సెంచరీ చేసిన అతిపిన్న వయస్కుడిగా రెస్టాఫ్ ఇండియా ప్లేయర్ యశస్వి జైస్వాల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇరానీ కప్‌లో భాగంగా బుధవారం రెస్టాఫ్ ఇండియా, మధ్యప్రదేశ్ మధ్య తొలి మ్యాచ్ ప్రారంభమైంది. ఇందులో టాస్ గెలిచిన రెస్టాఫ్ ఇండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది.
తొలిరోజు మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 87 ఓవర్లలో 381 పరుగుల భారీ స్కోరు చేసింది. రెస్టాఫ్ ఇండియా కెప్టెన్ మయాంక్ అగర్వాల్ నిరాశపరిచినా యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ, అభిమన్యు ఈశ్వరన్ సెంచరీతో రాణించడంతో రెస్టాఫ్ ఇండియా భారీ స్కోరు సాధించింది. యశస్వి జైస్వాల్ ధనాధన్ బ్యాటింగ్‌తో మధ్య ప్రదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
259 బాల్స్‌లో 30 ఫోర్లు, మూడు సిక్సర్లతో 213 పరుగులు చేశాడు యశస్వి జైస్వాల్. ఈ క్రమంలో ఇరానీ కప్‌లో డబుల్ సెంచరీ చేసిన అత్యంత చిన్న వయస్కుడైన క్రికెటర్‌గా యశస్వి నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ ప్రవీణ్ ఆమ్రే పేరుమీద ఉంది. 1990లో ప్రవీణ్ 22 ఏళ్లలో ఇరానీ కప్‌లో డబుల్ సెంచరీ చేశాడు. మధ్య ప్రదేశ్‌పై డబుల్ సెంచరీతో 21 ఏళ్లకే ఈ ఘనతను సాధించిన క్రికెటర్‌గా 33 ఏళ్ల క్రితం ప్రవీణ్ ఆమ్రే నెలకొల్పిన రికార్డును యశస్వి బ్రేక్ చేశాడు.
యశస్వితో పాటు అభిమన్యు ఈశ్వరన్ 240 బాల్స్‌లో 154 రన్స్ చేశాడు. మధ్య ప్రదేశ్ బౌలర్లలో ఆవేష్ ఖాన్ మినహా మిగిలిన వారు పూర్తిగా తేలిపోయారు. యశస్వి, అభిమన్యులను అడ్డుకోవడానికి మధ్యప్రదేశ్ ఏడుగురు బౌలర్లను ప్రయోగించిన ఫలితం లేకపోయింది.
టాపిక్