క్రికెటర్లు ముఖంపై రాసుకునే తెల్లటి క్రీమ్ ఏంటి? ఎందుకు రాసుకుంటారు?
పదే పదే బాల్‌ను తమ ప్యాంట్లకేసి బలంగా రుద్దడం, పిచ్‌పై బ్యాట్‌తో ట్యాప్ చేస్తుండటం, బ్యాటింగ్ ప్రారంభించే ముందు గార్డ్ తీసుకోవడంలాంటివి ప్రతి మ్యాచ్‌లో చూస్తూనే ఉంటాం. కానీ వాళ్లు ఇలా ఎందుకు చేస్తుంటారో చాలా మందికి తెలియదు. అలాంటి పనుల్లో ఈ వైట్ క్రీమ్ కూడా ఒకటి.
క్రికెట్‌ను రెగ్యులర్‌గా చూసే వాళ్లు క్రికెటర్లు తమ ముఖాలపై ఓ తెల్లటి క్రీమ్ రాసుకోవడం గమనించే ఉంటారు. ఇదేంటి అన్న సందేహం చాలా మందికి కలిగేదే. ఇదే కాదు క్రికెటర్లు చేసే చాలా పనులు టీవీల్లో అయినా, గ్రౌండ్‌లో ప్రత్యక్షంగా చూసే అభిమానులకైనా అర్థం కాదు. పదే పదే బాల్‌ను తమ ప్యాంట్లకేసి బలంగా రుద్దడం, పిచ్‌పై బ్యాట్‌తో ట్యాప్ చేస్తుండటం, బ్యాటింగ్ ప్రారంభించే ముందు గార్డ్ తీసుకోవడంలాంటివి ప్రతి మ్యాచ్‌లో చూస్తూనే ఉంటాం.
కానీ వాళ్లు ఇలా ఎందుకు చేస్తుంటారో చాలా మందికి తెలియదు. అలాంటి పనుల్లో ఈ వైట్ క్రీమ్ కూడా ఒకటి. ఎంతో మంది క్రికెటర్లు తమ ముఖాలకు, పెదాలకు ఈ వైట్ క్రీమ్ రాసుకొని కనిపిస్తారు. అదేంటి? దాని వల్ల ప్రయోజనాలేంటన్నది ఇప్పుడు చూద్దాం.
ఏంటా తెల్లటి క్రీమ్?
మనం ఎండలో బయటకు వెళ్లే సమయంలో సన్‌స్క్రీన్ లోషన్ శరీరానికి రాసుకుంటాం కదా. సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావయోలెట్ కిరణాలు శరీరాన్ని నేరుగా తాకితే.. చర్మం పాడవుతుందని భావించి మనం ఇలా చేస్తుంటాం. క్రికెటర్లు రాసుకునే వైట్ క్రీమ్ కూడా అలాంటి సన్‌స్క్రీన్ లోషన్లలో ఒకటి. దీనిని జింక్ ఆక్సైడ్ అంటారు. సాధారణ సన్‌స్క్రీన్ లోషన్ల కంటే ఈ జింక్ ఆక్సైడ్ భిన్నంగా పనిచేస్తుంది. సాధారణ లోషన్లు ఈ ప్రమాదకర కిరణాలను చర్మం పైపొర నుంచి కిందికి వెళ్లే అవకాశం ఇస్తాయి.
వీటి కారణంగా పైపొర దెబ్బతిన్నా.. లోపలి పొర ఆరోగ్యంగా ఉంటుంది. కానీ జింక్ ఆక్సైడ్ మాత్రం అసలు ఈ కిరణాలను చర్మం లోనికి వెళ్లకుండా అడ్డుకుంటాయి. ముఖంపై తెల్లగా మెరిసే ఈ క్రీమ్.. కిరణాలను పరావర్తనం చెందేలా చేస్తాయి. ఎండలో ఎక్కువ సేపు ఉండేవాళ్లకు ఈ జింక్ ఆక్సైడ్ చాలా బాగా పని చేస్తుంది. క్రికెటర్లు టెస్ట్ మ్యాచ్‌లలో రోజంతా గంటల తరబడి ఎండలో నిలబడాల్సి వస్తుంది. అందుకే వాళ్లు ఈ జింక్ ఆక్సైడ్‌ను ఎండ వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే ముఖానికి రాసుకుంటారు. జింక్ ఆక్సైడ్‌తో పోలిస్తే సాధారణ లోషన్లు బయటకు అలా తెల్లగా కనిపించవు.
జింక్ ఆక్సైడ్‌తో చాలా లాభాలు
సాధారణ సన్‌స్క్రీన్ లోషన్లు చర్మానికి రాసుకున్న తర్వాత వెంటనే ఎండలోకి వెళ్లడానికి వీలుండదు. ఇవి పని చేయడానికి కనీసం 20 నిమిషాలు పడుతుంది. అదే జింక్ ఆక్సైడ్ మాత్రం రాసుకున్న వెంటనే ఎండలోకి వెళ్లినా చర్మానికి ఏమీ కాదు. ఎలాంటి సున్నితమైన చర్మానికి కూడా ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ జింక్ ఆక్సైడ్ పని చేస్తుంది. సాధారణ లోషన్లు కొన్ని కొందరికి పడకపోవడం మనం చూస్తుంటాం. పిల్లలు కూడా ఈ జింక్ ఆక్సైడ్ రాసుకోవచ్చు. చిన్న వయసులో క్రికెట్ కెరీర్ ప్రారంభించే వాళ్లు కూడా ఈ జింక్ ఆక్సైడ్‌తో ప్రయోజనం పొందవచ్చు.
ఎక్కువగా ఎండ ప్రభావానికి గురవుతున్నాయనుకున్న శరీర భాగాలకు ఎక్కడైనా ఈ వైట్ జింక్ ఆక్సైడ్ క్రీమ్ రాసుకోవచ్చు. క్రికెటర్లు తగిన మోతాదులో ఈ క్రీమ్ రాసుకొని ఫీల్డ్‌లో ఆడటం వల్ల దీర్ఘకాలంలో తమ చర్మం దెబ్బతినకుండా జాగ్రత్త పడతారు. అయితే ఈ జింక్ ఆక్సైడ్‌ను చర్మంపై నుంచి తొలగించడం అంత సులువు కాదు. చల్లటి నీటితో మామూలుగా కడిగితే ఇది పోదు. మొదట కొబ్బరి నూనెను ఈ క్రీమ్ ఉన్న చోట రాసి ఆ తర్వాత వేడినీళ్లలో ముంచిన టవెల్‌తో మెల్లగా తుడవాల్సి ఉంటుంది. తర్వాత సబ్బుతో పూర్తిగా కడిగేయాలి. ఇవి ఆన్‌లైన్‌లో రూ. 1,500 నుంచి రూ. 3 వేల వరకూ ధరల్లో అందుబాటులో ఉంటాయి. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అంటే ఎస్‌పీఎఫ్ 30 లేదా 50 ఉన్నవి తీసుకుంటే మేలు.
సంబంధిత కథనం