WI vs IND: టాస్ గెలిచిన వెస్టిండీస్.. భారత్ బ్యాటింగ్
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో విండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపు కోసం ఇరుజట్లు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి.
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగనుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నెగ్గి పర్యటనను ఘనంగా ఆరభించాలని భారత్ ఆశిస్తోంది. సీనియర్ ఆటగాళ్లందరికీ విశ్రాంతినిచ్చిన వేళ.. టీమిండియాకు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మరోపక్క స్వదేశంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదలతో ఉంది కరేబియన్ల జట్టు. రోహిత్, కోహ్లి, బుమ్రా, షమి, పంత్, పాండ్యాలాంటి స్టార్ క్రికెటర్లు లేకుండానే వన్డే సిరీస్ బరిలోకి దిగుతోంది టీమిండియా.
ఇటీవలే ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచిన టీమిండియా మరో సిరీస్‌పై కన్నేసింది. విండీస్‌పై నెగ్గి ఆ విజయాల జాబితాను మరింత పెంచుకోవాలని చూస్తోంది. శిఖర్ ధావన్‌తో పాటు ఓపెనింగ్ చేయడానికి శుభ్‌మన్ గిల్ ఉన్నాడు.
ఇక మిడిలార్డర్‌కు కూడా సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌ల రూపంలో చాలా మంది రెడీగా ఉన్నారు. అక్షర్ పటేల్ శార్దూల్ ఠాకూర్ ఉన్నారు. జడేజాకు తోడు మరో స్పిన్నర్‌గా యుజువేంద్ర చహల్ తుది జట్టులో ఉంటాడు. అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ ఇప్పుడు టీమ్‌లో ఉన్నారు.
తుది జట్లు..
భారత్..
ధావన్, శుభ్‌మన్‌గిల్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజుశాంసన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, యుజువేంద్ర చహల్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
వెస్టిండీస్..
నికోలస్ పూరన్(కెప్టెన్), షాయ్ హోప్, సమర్థ్ బ్రూక్స్, కేసీ కార్టీ, రొమారియో షెపర్డ్, అకీల్ హోసెన్, అల్జారీ జోసెఫ్, బ్రెండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేశ్ మోట్లే, కీమో పాల్, రోమన్ పోవెల్, జేడెన్ స్టీల్స్
సంబంధిత కథనం
టాపిక్