virat kohli: బెయిర్ స్టో పై కోహ్లి స్లెడ్జింగ్...వైరల్ గా మారిన వీడియోలు-virat kohli sledging on bairstow video goes viral on social media ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli: బెయిర్ స్టో పై కోహ్లి స్లెడ్జింగ్...వైరల్ గా మారిన వీడియోలు

virat kohli: బెయిర్ స్టో పై కోహ్లి స్లెడ్జింగ్...వైరల్ గా మారిన వీడియోలు

HT Telugu Desk HT Telugu
Jul 03, 2022 05:25 PM IST

ఇంగ్లాండ్ జరుగుతున్న ఐదో టెస్ట్ లో కోహ్లి స్లెడ్జింగ్ హాట్ టాపిక్ గా మారింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ బెయిర్ స్టో పై కోహ్లి మాటల యుద్ధానికి దిగిన వీడియోలు ప్రసుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి (twitter)

గ్రౌండ్ బయట ఎప్పుడూ ప్రశాంతంగా చిరునవ్వుతో కనిపిస్తుంటారు విరాట్ కోహ్లి. కానీ పిచ్ లో అడుగుపెడితే మాత్రం చాలా అగ్రెసివ్ గా మారిపోతుంటారు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్ట్ సందర్భంగా మరోసారి తన దూకుడు స్వభావాన్ని చాటుకున్నారు కోహ్లి. ఇంగ్లాండ్ వరుసగా వికెట్లు కోల్పోతున్న తరుణంలో బెయిర్ స్టో క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించాడు. అతడి ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ఫస్ట్ స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి స్లెడ్జింగ్ కు పాల్పడటం మ్యాచ్ కు హైలైట్ గా మారింది. రెండో రోజు మ్యాచ్ లో షమీ బౌలింగ్ లో షాట్స్ కొట్టేందుకు ప్రయత్నిస్తూ పలుమార్లు విఫలమయ్యాడు బెయిర్ స్టో.

ఈ క్రమంలో కోహ్లి న్యూజిలాండ్ పేసర్ టీమ్ సాథీ పేరును ఉపయోగిస్తూ అతడి కంటే వేగంగా బౌలింగ్ చేస్తున్నాడు కదూ అంటూ బెయిర్ స్టో పై కామెంట్స్ చేశాడు. కోహ్లి కామెంట్స్ కు బెయిర్ స్టో సీరియస్ కావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో అంపైర్ తో పాటు ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ సర్ధిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. మూడో రోజు మరోసారి విరాట్ తన నోటికి పనిచెప్పాడు. బెయిర్ స్టోపై మళ్లీ స్లెడ్జింగ్ చేశాడు.

బుమ్రా బౌలింగ్ లో బ్యాట్ ఝులిపించేందుకు బెయిర్ స్టో ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. అదే సమయంలో కోహ్లి అతడిపై కామెంట్స్ చేశాడు. ఆ మాటలకు కోహ్లి వైపు బెయిర్ స్టో కోపంగా చూస్తూ కనిపించాడు. అతడి చూపులను లెక్క చేయకుండా నోరు మూసుకొని బ్యాటింగ్ పై దృష్టిపెట్టూ అంటూ కోహ్లి గట్టిగానే సమాధానం ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ ఆరు వికెట్ల నష్టానికి200 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టీమ్ ఇండియా 416 రన్స్ కు ఆలౌట్ అయ్యింది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్