Fantasy Sports | బెస్ట్‌ ఫ్యాంటసీ స్పోర్ట్స్‌ యాప్స్‌ ఇవే.. ఆడుతూ సంపాదించేయండి-these are the best fantasy sports apps in india to play and win money ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /   Fantasy Sports | బెస్ట్‌ ఫ్యాంటసీ స్పోర్ట్స్‌ యాప్స్‌ ఇవే.. ఆడుతూ సంపాదించేయండి

Fantasy Sports | బెస్ట్‌ ఫ్యాంటసీ స్పోర్ట్స్‌ యాప్స్‌ ఇవే.. ఆడుతూ సంపాదించేయండి

Hari Prasad S HT Telugu
Jan 24, 2022 08:37 PM IST

Fantasy Sports.. టీవీల్లో క్రికెట్‌ మ్యాచ్‌లు చూస్తున్నప్పుడు కూడా మీరు Dream 11, MPL వంటి ఫ్యాంటసీ స్పోర్ట్స్ యాప్స్‌ యాడ్స్‌ను చూసే ఉంటారు. ఈ యాప్స్‌ మంచి థ్రిల్‌ అందించడంతోపాటు మీ స్పోర్ట్స్‌ నైపుణ్యాన్ని పెంచుతాయి. కాస్త అదృష్టం కూడా కలిసి వస్తే డబ్బులూ సంపాదించవచ్చు. ఇలాంటి యాప్స్‌ ఇండియాలో చాలానే ఉన్నాయి.

<p>ఫ్యాంటసీ స్పోర్ట్స్ యాప్స్ కు పెరుగుతున్న డిమాండ్</p>
ఫ్యాంటసీ స్పోర్ట్స్ యాప్స్ కు పెరుగుతున్న డిమాండ్ (Reuters)

Fantasy Sports.. మొబైల్‌ ఫోన్లలో, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో గేమ్స్‌ ఆడటం కామనే. అయితే ఈ మధ్య కాలంలో సరదాగా ఆడుతూ సంపాదించే అవకాశం ఇస్తున్న ఫ్యాంటసీ స్పోర్ట్స్‌ యాప్స్‌, వెబ్‌సైట్స్‌కు ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. క్రికెట్‌, కబడ్డీ, ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో విన్నింగ్‌ టీమ్స్‌ను ఎంపిక చేయడమే మీరు చేయాల్సిన పని. 

టీవీల్లో క్రికెట్‌ మ్యాచ్‌లు చూస్తున్నప్పుడు కూడా మీరు Dream 11, MPL వంటి ఫ్యాంటసీ స్పోర్ట్స్ యాప్స్‌ యాడ్స్‌ను చూసే ఉంటారు. ఈ యాప్స్‌ మంచి థ్రిల్‌ అందించడంతోపాటు మీ స్పోర్ట్స్‌ నైపుణ్యాన్ని పెంచుతాయి. కాస్త అదృష్టం కూడా కలిసి వస్తే డబ్బులూ సంపాదించవచ్చు. ఇలాంటి యాప్స్‌ ఇప్పుడు ఇండియాలో చాలానే ఉన్నాయి. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లు ఎవరైనా వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ యాప్స్‌లో బెస్ట్‌ ఏవో ఇప్పుడు చూద్దాం.

Dream 11

ఈ మధ్య కాలంలో బాగా పాపులర్‌ అయిన ఫ్యాంటసీ యాప్స్‌లో ఈ Dream 11 టాప్‌లో ఉంటుంది. క్రికెట్‌తోపాటు ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో టీమ్స్‌ను ఎంపిక చేసే చాన్స్‌ ఈ యాప్‌ ద్వారా ఉంటుంది. ఇండియాలో సుమారు 10 కోట్ల మంది యూజర్లతో ఫ్యాంటసీ యాప్స్‌లో తొలి స్థానంలో ఉంది ఈ డ్రీమ్‌ 11. పేమెంట్ పద్ధతి కూడా చాలా సురక్షితంగా ఉండటంతో యూజర్లు ఈ యాప్‌కు పెద్ద ఎత్తున పాజిటివ్‌ రివ్యూలు ఇస్తున్నారు.

MPL

మొబైల్‌ ప్రిమియర్‌ లీగ్‌.. సింపుల్‌గా MPL. ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ విరాట్ కోహ్లి దీనికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నాడు. ఐపీఎల్‌లో మూడు సీజన్ల నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టీమ్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా ఈ ఎంపీఎల్‌ ఉంది. టాప్‌ ఫ్యాంటసీ గేమింగ్‌ యాప్స్‌లో ఇదీ ఒకటి. ఇందులో క్రికెట్‌, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, బేస్‌బాల్‌ ఆడవచ్చు. లుడో, క్విజ్‌ వంటి ఇతర గేమ్స్‌ ద్వారా కూడా సంపాదించే వీలు ఈ ఎంపీఎల్‌ యాప్‌లో ఉండటం విశేషం.

My11circle

బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీకెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీతోపాటు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌ వాట్సన్‌లాంటి వాళ్లతో పోటీ పడాలనుకుంటే ఈ My11circle యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి. క్రికెట్‌తోపాటు ఫుట్‌బాల్‌ టీమ్స్‌ను కూడా మీరు ఎంపిక చేయవచ్చు. మీ స్పోర్ట్స్‌ నైపుణ్యాన్ని మరింత పెంచుకోవడానికి ఈ ఇద్దరు ఎక్స్‌పర్ట్స్‌తో పోటీ పడే అవకాశం ఇందులో ఉంటుంది.

PlayerzPot

క్రికెట్‌, ఫుట్‌బాలే కాకుండా ఇతర ఫ్యాంటసీ స్పోర్ట్స్‌ ఆడాలనుకుంటే ఈ PlayerzPot యాప్‌ బెస్ట్‌. ఇందులో కూడా రోజువారీగా బహుమతులు ఉంటాయి. కబడ్డీ, హాకీ, బాస్కెట్‌బాల్‌, బేస్‌బాల్‌ వంటి స్పోర్ట్స్‌ కూడా ఈ యాప్‌లో ఆడొచ్చు.

MyTeam11

ఈ MyTeam11 ఫ్యాంటసీ స్పోర్ట్స్‌ యాప్‌లో క్రికెట్‌ కాకుండా మరో నాలుగు స్పోర్ట్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఫుట్‌బాల్‌, బేస్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌ కూడా ఆడొచ్చు. ఐదేళ్ల కిందట ప్రారంభమైన ఈ యాప్‌కు ఇండియాలో కోటిన్నరకుపైగా యూజర్లు ఉన్నారు.

|#+|

Premier League

కేవలం ఫుట్‌బాల్‌ ఆడాలని అనుకునే వాళ్లకు ఈ Premier League వెబ్‌సైట్‌ బెస్ట్‌. ఏ దేశంలో జరిగే ఏ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో అయినా ఈ యాప్‌ ద్వారా భాగం కావచ్చు. ఇందులో మ్యాచ్‌లకు సంబంధించిన వీడియోలు కూడా చూడొచ్చు. అయితే దీనికి యాప్‌ లేదు. వెబ్‌లోనే ఆడాల్సి ఉంటుంది.

ESPN Fantasy Sports

ప్రపంచంలోని టాప్‌ స్పోర్ట్స్‌ మీడియాలో ఒకటి ESPN. ఆ కంపెనీ నుంచి వచ్చిందే ఈ ESPN Fantasy Sports. అయితే ఇందులో క్రికెట్‌ ఆడే అవకాశం లేదు. ఫుట్‌బాల్‌, బేస్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, హాకీ గేమ్స్‌ ఆడొచ్చు.

CricPlay

కేవలం క్రికెట్‌ మాత్రమే ఆడాలనుకునే వాళ్లకు ఈ CricPlay ఫ్యాంటసీ యాప్‌ బెస్ట్‌. మ్యాచ్‌, అందులో ఒక కాంటెస్ట్‌ ఎంపిక చేసుకొని డ్రీమ్‌ టీమ్‌ను సెలక్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఫ్రెండ్స్‌తో ఆడటానికి ప్రైవేట్‌ కాంటెస్ట్‌ ఆప్షన్‌ కూడా ఉండటం విశేషం. అయితే కేవలం యాండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే ఈ యాప్‌ అందుబాటులో ఉంది.

11Wickets.com

స్పోర్ట్స్‌ అంటేనే వ్యూహాత్మకంగా ఉంటాయి. ఎవరు వ్యూహాలకు పదును పెడతారో వాళ్లే విజయం సాధిస్తారు. అలాంటి స్ట్రేటజీలను ఇష్టపడే వారి కోసం ఈ 11Wickets.com యాప్‌. ఐఓఎస్‌ యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ యాప్‌లో క్రికెట్‌, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, కబడ్డీ, బేస్‌బాల్‌ టీమ్స్‌ను ఎంపిక చేయవచ్చు. బెస్ట్‌ స్ట్రాటజీతో గేమ్‌ గెలిచిన వారిని విజేతగా ఎంపిక చేస్తారు.

Whats_app_banner

సంబంధిత కథనం