Team India: కరీబియన్ దీవుల్లో బీచ్ వాలీబాల్.. క్రికెట్ పక్కన పెట్టేసిన టీమిండియా
Team India: కరీబియన్ దీవుల్లో బీచ్ వాలీబాల్ ఆడుతూ కనిపించారు టీమిండియా క్రికెటర్లు. క్రికెట్ పక్కన పెట్టి కాసేపు ఇలా ఎంజాయ్ చేశారు. ఈ వీడియోను బీసీసీఐ షేర్ చేసింది.
Team India: చాలా రోజుల తర్వాత పూర్తిస్థాయి వెస్టిండీస్ టూర్ కు వెళ్లిన టీమిండియా.. అక్కడ సిరీస్ ప్రారంభానికి ముందు బీచ్ వాలీబాల్ ఆడుతూ ఎంజాయ్ చేసింది. ప్లేయర్స్ అందరూ సరదాగా కనిపించారు. రెండు టెస్టులతోపాటు వన్డేలు, టీ20లు కూడా ఆడనున్న ఇండియన్ టీమ్.. అసలు క్రికెట్ ప్రారంభమయ్యే ముందు ఖాళీ సమయానికి ఇలా గడుపుతోంది.
ట్రెండింగ్ వార్తలు
జులై 12 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుండగా.. పది రోజుల ముందే ప్లేయర్స్ అందరూ కరీబియన్ దీవులకు వెళ్లారు. ఇక తాజాగా డొమినికాలోని ఓ బీచ్ లో ప్లేయర్స్ బీచ్ వాలీబాల్ ఆడుతున్న వీడియోను బీసీసీఐ తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేసింది. ఇందులో విరాట్ కోహ్లిలాంటి టాప్ ప్లేయర్స్ తోపాటు కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఆడటం విశేషం.
ఇషాన్ కిషన్ మాత్రం బయట కూర్చొని వాళ్లను ఎంకరేజ్ చేశాడు. మధ్యమధ్యలో కామెంట్రీ కూడా ఇస్తూ కనిపించాడు. నెల రోజుల పాటు వెస్టిండీస్ లో పర్యటించనున్న ఇండియన్ టీమ్.. తర్వాత ఐర్లాండ్ లో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. వెస్టిండీస్ లో మొత్తం రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.
జులై 27, 29, ఆగస్ట్ 1న ఇండియా, వెస్టిండీస్ మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. ఆగస్ట్ 3 నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే వరల్డ్ కప్ కు ముందు ఇండియాకు ఈ సిరీస్ ఎంతగానో ఉపయోగపడనుంది.
ఇండియా టెస్ట టీమ్ ఇదే
రోహిత్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, రహానే, భరత్, ఇషాన్ కిషన్, అశ్విన్, జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, సిరాజ్, ముకేశ్ కుమార్, జైదేవ్ ఉనద్కట్, నవ్‌దీప్ సైనీ