Rauf On Kohli Six : కోహ్లీ మళ్లీ అలా ఆడలేడు.. పాకిస్థాన్ బౌలర్-t20 world cup pakistan bowler haris rauf comments on virat kohli six ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  T20 World Cup Pakistan Bowler Haris Rauf Comments On Virat Kohli Six

Rauf On Kohli Six : కోహ్లీ మళ్లీ అలా ఆడలేడు.. పాకిస్థాన్ బౌలర్

Anand Sai HT Telugu
Jan 09, 2023 11:57 AM IST

Haris Rauf comments on Kohli :కిందటి ఏడాది.. టీ20 ప్రపంచకప్‌లో భారత్ నిరాశ పరిచింది. అయితే.. పాకిస్థాన్‌తో జరిగిన సూపర్-12 మ్యాచ్‌లో జట్టును కోహ్లీ గెలిపించాడు. ఇందులో కోహ్లీ అరుదైన షాట్ ఆడాడు. దీనిపై పాకిస్థాన్ బౌలర్ హరీస్ రవూఫ్ స్పందించాడు.

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (PTI)

గతేడాది.. టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు నిరాశపరిచింది. భారత క్రికెట్ అభిమానులు ఎంతగానో ఫీలయ్యారు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలై టోర్నీ నుంచి ఇండియా(India) నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు.. సూపర్ 12 దశలో పాకిస్థాన్‌(Pakistan)తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో గెలిచింది.

ట్రెండింగ్ వార్తలు

ఈ మ్యాచ్ లో మెుదట భారత్ ఓటమి దిశగా వెళ్లింది. విరాట్ కోహ్లీ(Virat Kohli) అద్భుతంగా రాణించి జట్టును ఆదుకున్నాడు. 31 పరుగులకే.. నాలుగు వికెట్లు కోల్పోయింది భారత్. ఈ దశలో కోహ్లీ రంగంలోకి దిగాడు. ఒత్తిడిని ఎదుర్కొని సైతం.. 53 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఎవరూ ఊహించని.. విధంగా జట్టును గెలిపించాడు.

ఈ మ్యాచ్‌లో హైలెట్ విషయం ఏంటంటే.. హరీస్ రవూఫ్(Haris Rauf) బౌలింగులో కోహ్లీ రెండు సిక్సులు బాదడం. 19వ ఓవర్ వేసిన పేసర్ హరీస్ రవూఫ్ బౌలింగులో కోహ్లీ వరుస సిక్సర్లు కొట్టాడు. ఈ విషయాన్ని ఇప్పటికీ.. క్రికెట్ అభిమానులు మరిచిపోరు. ఇక ఇందులో మెుదటి సిక్స్ సూపర్. గ్రౌండ్ మీదుగా స్ట్రెయిట్ డౌన్ షాట్ ఆడిన తర్వాత కొట్టిన ఈ సిక్సర్‌ హైలెట్. ఈ సిక్స్ పై చాలా మంది కోహ్లీపై ప్రశంసలు కురిపించారు.

ఇక ఇప్పటి విషయానికి వస్తే.. తాజాగా దీనిపై.. పాకిస్థాన్ బౌలర్ హరీస్ రవూఫ్ మాట్లాడాడు. పాకిస్థాన్ పాపులర్ టీవీ షో ‘హస్నా మానా హై’లో పాల్గొన్నాడు. కోహ్లీ బాదిన సిక్సర్‌పై ఓ అభిమాని ప్రశ్న వేయగా.. రవూఫ్ సమాధానం ఇచ్చాడు. ఇలాంటి షాట్లు క్రికెట్‌(Cricket)లో చాలా అరుదని, ఇలాంటి షాటును కోహ్లీ కూడా మళ్లీ ఆడలేడని రవూఫ్ చెప్పాడు. 'ఆ షాట్ గురించి నేను ఏమీ చెప్పలేను. కానీ నేను మాత్రం వ్యక్తిగతంగా బాధపడ్డాను. అయితే కోహ్లీ(Kohli) మళ్లీ అలాంటి షాట్ కొట్టగలడని నేను అనుకోవడం లేదు. ఇలాంటివి క్రికెట్‌లో చాలా అరుదు. వాటిని మళ్లీమళ్లీ కొట్టలేరు. కోహ్లీ టైమింగ్ సరిగా ఉండడంతోనే ఆ బంతి స్టాండ్స్‌లోకి వెళ్లింది.'అని హరీస్ రవూఫ్ అన్నాడు.

WhatsApp channel

సంబంధిత కథనం