Jadeja Doubtful Substance: జడేజా వేలికి ఏం రాసుకున్నాడు?-siraj passes unknown substance to jadeja in 1st test against australia ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Jadeja Doubtful Substance: జడేజా వేలికి ఏం రాసుకున్నాడు?

Jadeja Doubtful Substance: జడేజా వేలికి ఏం రాసుకున్నాడు?

Maragani Govardhan HT Telugu
Jan 08, 2024 08:28 PM IST

Jadeja Doubtful Substance: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో సిరాజ్ నుంచి జడేజా వేలికి ఏదో రాసుకున్నట్లున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ వాన్ ఈ అంశంపై ట్వీట్ చేశాడు.

జడేజా వేలికి ఏం రాసుకున్నాడు
జడేజా వేలికి ఏం రాసుకున్నాడు

సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న రవీంద్ర జడేజా తన రీ ఎంట్రీలో అద్బుత ప్రదర్శన చేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో జడేజా ఐదు వికెట్లతో విశేషంగా రాణించాడు. మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ లాంటి భీకర ఆటగాళ్లను సైతం పెవిలియన్ చేర్చి ఆసీస్ పతనాన్ని శాసించాడు. దీంతో అతడిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో జడేజాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లు ముగిసే సమయానికి స్కోరు 120/5గా ఉంది. అప్పటికే జడ్డూ మూడు వికెట్లు పడగొట్టి మంచి జోరుమీదున్నాడు. ఈ క్రమంలో 46వ ఓవర్ వేయడానికి జడ్డూ బంతిని అందుకున్నాడు. అయితే అంతకుముందే సిరాజ్ దగ్గరకు వెళ్లాడు. అతడి దగ్గర ఏదో పదార్థాన్ని తీసుకుని బంతిని స్పిన్ వేసే వేలికి రాసుకున్నాడు. అనంతరం కెప్టెన్ రోహిత్‌తో కలిసి ఫీల్డింగ్ సెట్ గురించి మాట్లాడి బౌలింగ్‌ను కొనసాగించాడు.అయితే జడేజా వేలిపై ఏం రాసుకున్నాడనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

దీనిపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ట్విటర్ వేదికగా స్పందించాడు. "జడ్డూ తన వేలికి ఏం పూసుకున్నాడు? ఇలాంటి దాన్ని ఎప్పుడు చూడలేదు" అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో ఆసీస్ 177 పరుగులకే కుప్పుకూలింది. రవీంద్ర జడేజా 5 వికెట్లతో అదరగొట్టగా.. రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. షమీ, సిరాజ్ చెరో వికెట్‌లో ఆదిలోనే ఆసీస్‌ను దెబ్బకొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి రోజు పూర్తయ్యే సమయానికి వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(56) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.

Whats_app_banner