Akhtar Refused Captaincy: కెప్టెన్సీ వద్దనుకున్న అక్తర్.. ఎందుకో చెప్పిన పాక్ మాజీ పేసర్
Akhtar Refused Captaincy: పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌కు 2002లో దాయాది జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశమొచ్చిందట. ఈ విషయాన్ని అతడే స్వయంగా తెలిపాడు. అయితే ఆ సమయంలో తాను వద్దనుకున్నట్లు స్పష్టం చేశాడు.
Akhtar Refused Captaincy: పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) క్రికెట్ తర్వాత తన కెరీర్‌ను యూట్యూబ్ ఛానల్‌పై ఫోకస్ పెట్టాడు. క్రికెట్ రివ్యూస్ ఇవ్వడమే కాకుండా.. తన స్పందనలను కూడా యూట్యూబ్ ద్వారానే ఇస్తున్నాడు. అంతేకాకుండా కెరీర్‌లో తను ఎదుర్కొన్న అనుభవాలను, జ్ఞాపకాలను కూడా ఇదే వేదికగా తెలియజేస్తున్నాడు. ఓ సారి తనకు పాకిస్థాన్ కెప్టెన్ అయ్యే అవకాశం కూడా వచ్చిందని తాజాగా స్పష్టం చేశాడు. 2002లో పాక్ జట్టుకు కెప్టెన్ అయ్యే ఛాన్స్ వచ్చిందని, అయితే అప్పుడు తాను వద్దనుకున్నట్లు తెలిపాడు.
"నేను కెప్టెన్‌గా, బౌలర్‌గా రెండు విధాల ఫిట్ కాలేనని అర్థమైంది. ఎందుకంటే అప్పట్లో ఐదు మ్యాచ్‌ల్లో మూడింటిలో మాత్రమే ఆడేవాడిని. ఎక్కువగా గాయపడుతూ ఉండేవాడిని. 2002లో నేను కెప్టెన్ అయినట్లయితే మహా ఒకటిన్నర నుంచి 2 సంవత్సరాల మాత్రమే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుండే వాడిని. అందుకే కెప్టెన్సీ వద్దనుకున్నాను." అని షోయబ్ అక్తర్ తెలిపాడు.
ఆప్పట్లో తన సహచరుల నుంచి పూర్తి మద్దతు ఉందని, కానీ పాకిస్థాన్ బోర్డు నుంచే సపోర్ట్ లభించలేదని అక్తర్ స్పష్టం చేశాడు.
"నాకు నా టీమ్ మేట్స్ నుంచి పూర్తి సహకారం లభించేది. కానీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో స్థిరత్వం లేదు. ఎందుకంటే అప్పట్లో మేనేజ్మెంట్ సరిగ్గా ఉండేది కాదు. ఆ సమయంలో సరైన మేనేజ్మెంట్ లేక కొన్ని సవాళ్లు ఎదుర్కొన్నాం." అని అక్తర్ తెలిపాడు.
47 ఏళ్ల అక్తర్ పాకిస్థాన్ తరఫున 1997లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. కెరీర్‌లో ఎక్కువగా గాయాలపాలైన అక్తర్.. తక్కువ మ్యాచ్‌లే ఆడాడు. 2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు. రిటైర్మెంట్ తర్వాత యూట్యూబ్ ఛానల్‌నే కెరీర్‌గా మార్చుకున్నాడు. 2002లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అతడు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతిని సంధించాడు. గంటకు 161 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు.