Sai Sudharsan: తమిళనాడు ప్రీమియర్ లీగ్ - తొలి మ్యాచ్‌లోనే ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన సాయిసుదర్శన్
Sai Sudharsan: ఐపీఎల్ లో బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించిన గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయిసుదర్శన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు.
Sai Sudharsan: ఐపీఎల్‌లో చక్కటి బ్యాటింగ్‌తో రాణించాడు గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయిసుదర్శన్. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో 96 పరుగులతో ఆకట్టుకున్నాడు. కానీ చెన్నై జోరుతో అతడి పోరాటం వృథాగా మారింది. ఐపీఎల్ ఫామ్‌ను తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లోను కొనసాగించాడు సాయి సుదర్శన్. టీఎన్‌పీఎల్ లీగ్ సోమవారం ప్రారంభమైంది.
ఈ టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో లైకా కోవై కింగ్స్, ఐడ్రీ తిరుప్పర్ తామిజాన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో తన జట్టును గెలిపించాడు సాయిసుధర్. ఈ లీగ్‌లో లైకా కోవై కింగ్స్ తరఫున బరిలో దిగిన సాయి సుదర్శన్ 45 బాల్స్‌లోనే ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 86 రన్స్ చేశాడు. తొలుత నెమ్మదిగా ఆడిన సాయిసుదర్శన్ చివరలో ఒక్కసారిగా జూలు విదిల్చాడు.
కేవలం ఏడు బాల్స్‌లోనే నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లతో 24 రన్స్ చేశాడు. షారుఖ్‌ఖాన్ కూడా బ్యాట్ ఝులిపించడంతో లైకా కోవై కింగ్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఐడ్రీమ్ తిరుప్పుర్ బౌలర్ విజయ్ శంకర్ మూడు వికెట్లతో రాణించాడు.
లక్ష్య ఛేదనలో తడబడిన ఐడ్రీమ్ తిరుప్పుర్ 20 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో ఐడ్రీమ్ తిరుప్పుర్‌పై లైకా కోవై కింగ్స్ 70 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించిన షారుఖ్‌ఖాన్ నాలుగు ఓవర్లు వేసి 20 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు.
కాగా ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థులుగా బరిలో దిగిన సాయిసుదర్శన్, విజయ్ శంకర్ ఐపీఎల్‌లో మాత్రం గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహించడం గమనార్హం.
టాపిక్