Ritika About Pant Accident: పంత్‌ ఫొటోలు షేర్ చేసిన వారికి సిగ్గుండాలి.. రోహిత్ భార్య ఫైర్-rohit sharma wife ritika sajdeh criticizes who share rishab pant post accident visuals ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ritika About Pant Accident: పంత్‌ ఫొటోలు షేర్ చేసిన వారికి సిగ్గుండాలి.. రోహిత్ భార్య ఫైర్

Ritika About Pant Accident: పంత్‌ ఫొటోలు షేర్ చేసిన వారికి సిగ్గుండాలి.. రోహిత్ భార్య ఫైర్

Maragani Govardhan HT Telugu
Dec 31, 2022 07:49 PM IST

Ritika About Pant Accident: రిషబ్ పంత్ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంపై రోహిత్ భార్య రితిక సీరియస్ అయ్యారు. బాధితుల ఫొటోలను షేర్ చేయడం సరికాదంటూ విమర్శించారు.

రిషబ్ పంత్
రిషబ్ పంత్ (PTI)

Ritika About Pant Accident: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ శుక్రవారం ఉదయం కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరూ అతడు త్వరగా కోరుకోవాలని ఆశించారు. దిల్లీ-దెహ్రాదూన్ హైవేలో జరిగిన ఈ ఘటనతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. క్షణాల్లో అతిడి యాక్సిడెంటుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చెందాయి. నెటిజన్లు ఆ ఫొటోలను విపరీతంగా షేర్ చేశారు. ఇలా షేర్ చేయడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికా తప్పుపట్టారు. బాధితులకు కూడా కుటుంబ సభ్యులు ఉంటారని, ఈ ఫొటోలు వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని మండిపడ్డారు.

"రిషబ్ పంత్ కారు ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసిన వారిని సిగ్గుగా ఉంది. ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు ఇలాంటివి వారికి కావాల వద్దా అనేది నిర్ణయించుకోలేరు. సదరు బాధితుల వ్యక్తుల ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేయడం వల్ల వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్రంగా ప్రభావితమవుతారు." అని రితికా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టారు.

రితికానే కాకుండా క్రీడా సమాజం నుంచి పలువురు పంత్‌కు ప్రైవసీ ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో కూడా ఈ అంశంపై స్పందించారు.

"రిషబ్ పంత్ నువ్వు వేగంగా కోలుకోవాలి. ప్రమాదంలో ఉన్న వ్యక్తులను చూడటం ఎప్పుడూ సంతోషాన్ని కలిగించదు. అయితే అతడి ఆరోగ్యం నిలకడగా ఉండటం సంతోషకరం. ప్రస్తుతానికి అతడి ప్రైవసీకి భంగం కలిగించకుండా విశ్రాంతి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను" అని బెయిర్ స్టో ట్వీట్ చేశాడు.

రిషబ్ పంత్ శుక్రవారం ఉదయం ఉత్తరాఖండ్ నుంచి దిల్లీకి వస్తుండగా కారు ప్రమాదం చోటు చేసుకుంది. రూర్కీ సమీపంలో హమందాపుర్ ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. పంత్ ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారు అదుపు తప్పి వేగంగా రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. తృటిలో ప్రాణాల నుంచి తప్పించుకున్ని క్రికెటర్‌ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్