Rohit on Bumrah: బుమ్రా చివరి రెండు టెస్టులకు వస్తాడనుకుంటున్నా.. రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు-rohit sharma says i am hoping jasprit bumrah will play in last two tests ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rohit On Bumrah: బుమ్రా చివరి రెండు టెస్టులకు వస్తాడనుకుంటున్నా.. రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Rohit on Bumrah: బుమ్రా చివరి రెండు టెస్టులకు వస్తాడనుకుంటున్నా.. రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
Jan 25, 2023 11:25 AM IST

Rohit on Bumrah: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియాతో జరగనున్న చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. ఈ విషయం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మనే స్వయంగా తెలిపాడు.

బుమ్రాపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
బుమ్రాపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు (AFP)

Rohit on Bumrah: ప్రస్తుతం టీమిండియా.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ముగించుకుని టీ20 సిరీస్ కోసం చూస్తోంది. ఈ సిరీస్ ముగిసన తర్వాత భారత్.. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. వచ్చే నెల నుంచి ఆరంభం కానున్న ఈ సిరీస్‌కు సంబంధించి ఇప్పటికే జట్టను కూడా ప్రకటించింది బీసీసీఐ. అయితే జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌కైనా అందుబాటులో ఉంటాడా లేదా అనేది సందిగ్ధం నెలకొంది. తాజాగా ఈ అంశంపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. చివరి రెండు టెస్టులకైనా అతడు అందుబాటులో ఉంటాడని తాము ఆశిస్తున్నట్లు స్పష్టం చేశాడు.

"బుమ్రా గురించి ఇప్పుడే ఏం చెప్పలేను. ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్‌లో చివరి రెండు టెస్టులకైనా అతడు అందుబాటులో ఉంటాడని అనుకుంటున్నా. వెన్ను గాయం కారణంగా మేము అతడి ఆరోగ్యం విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోలేం. భవిష్యత్తులో అతడు ఇంకా ఎంతో రాణించాల్సి ఉంది. అతడి ఆరోగ్యం గురించి నేషనల్ క్రికెట్ అకాడమీలోని ఫిజియో, వైద్యులతో నిరంతరం టచ్‌లో ఉంటూనే ఉన్నాం. వైద్య బృందం అతడికి కావాల్సినంత సమయాన్ని ఇస్తూ పర్యవేక్షిస్తోంది" అని రోహిత్ శర్మ తెలిపాడు.

భారత్ ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. గతేడాది ఇంగ్లాండ్ పర్యటన తర్వాత బుమ్రా వెన్ను నొప్పితో బాధపడ్డాడు. ఫలితంగా ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్‌నకు కూడా దూరమయ్యాడు. శ్రీలంతో జరిగిన మూడో వన్డే సిరీస్‌కే పునరాగమనం చేయాల్సి ఉండగా గాయం తిరగబెట్టడంతో అది సాధ్యం కాలేదు. దీంతో అతడు మల్లీ ఎన్‌సీఏకి వెళ్లాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2022లో బోర్డర్-గవాస్కర్ ట్రోపీ కీలకం కావడంతో బుమ్రా రాకపై ఆత్రుతగా చూస్తున్నారు.

ఫిబ్రవరి 9న నాగ్‌పుర్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆరంభం కానుంది. చివరి రెండు టెస్టులు మార్చి మొదటి రెండు వారాల్లో జరగనుంది. టీ20 ప్రపంచకప్ జట్టులో వచ్చేందుకు గాను గత అక్టోబరు-నవంబరులో ఆస్ట్రేలియాతో స్వదేశంలో బుమ్రా టీ20 సిరీస్ ఆడాడు. అక్కడ మళ్లీ అతడు గాయపడ్డడాడు. దీంతో దీర్ఘకాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు.

Whats_app_banner

సంబంధిత కథనం