Pakistan Team New Coach: న్యూజిలాండ్ సిరీస్ కోసం పాకిస్థాన్ కొత్త ప్లాన్ - ఆ దేశపు మాజీ ప్లేయర్ కోచ్‌గా ఎంపిక
Pakistan Team New Coach: న్యూజిలాండ్‌తో త్వరలోనే జరుగనున్న టీ20, వన్డేసిరీస్‌లో విజయం సాధించేందుకు పాకిస్థాన్ కొత్త ప్లాన్ వేసింది. అదేమిటంటే...
Pakistan Team New Coach: క్రికెట్‌లో గెలుపు కోసం పాకిస్థాన్ చేసే పనులు కొన్ని సార్లు విమర్శల పాలు అవుతుంటాయి. న్యూజిలాండ్‌తో త్వరలోనే పాకిస్థాన్ టీ20తో పాటు వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం తాత్కాలిక కోచ్‌గా న్యూజిలాండ్‌కు చెందిన గ్రాంట్ బ్రాడ్‌బర్న్‌ను పాక్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది.
న్యూజిలాండ్‌తో సిరీస్ కోసం న్యూజిలాండ్ మాజీ ప్లేయర్‌ను తాత్కాలిక కోచ్‌గా ఎంపికచేయడంపై క్రికెట్ ఫ్యాన్స్ నుంచి విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. ఈ సిరీస్‌లో గెలుపు కోసమే పాకిస్థాన్ వేసిన కొత్త ప్లాన్ ఇదంటూ విమర్శలు కురిపిస్తోన్నారు.
కాగా న్యూజిలాండ్ తరఫును ట్రాండ్‌బ్రాడ్‌బర్న్ ఏడు టెస్టులు, 11 వన్డేలు ఆడాడు. అంతే కాకుండా న్యూజిలాండ్‌లోని పలు దేశవాళీ టీమ్‌లకు కోచ్‌గా వ్యవహరించాడు. న్యూజిలాండ్ ఆటగాళ్ల బ్యాటింగ్ స్టైల్‌పై అతడికి చాలా అవగాహన ఉంది. ఆ అనుభవాన్ని ఉపయోగించుకుంటూ ఈ సిరీస్‌లో విజయం సాధించేందుకు పాక్ వేసిన ఎత్తు ఇదని క్రికెట్ ఫ్యాన్స్ అంటోన్నారు.
న్యూజిలాండ్ దేశవాళీ టీమ్‌లతో పాటు స్కాట్‌లాండ్‌కు చాలా కాలం పాటు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు బ్రాడ్‌బర్న్. పాకిస్థాన్‌కు 2018 - 20 వరకు ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతల్ని నిర్వర్తించాడు. పాకిస్థాన్ ప్రధాన కోచ్‌గా మాజీ ప్లేయర్ సక్లైన్ ముస్తాక్ బాధ్యతలు ఫిబ్రవరిలో ముగిసాయి.
అప్పటి నుంచి కోచ్ కోసం పాక్ అన్వేషిస్తూనే ఉంది. సౌతాఫ్రికా మాజీ ఆటగాడు మికీ ఆర్థర్‌కు కోచ్ బాధ్యతల్ని అప్పగించనున్నట్లు వార్తలొస్తున్నాయి. పాక్ క్రికెట్ బోర్డ్‌లో నెలకొన్న అస్థిరత కారణంగా మికీ అర్థర్ కోచ్ బాధ్యతల్ని చేపట్టడం అనుమానంగానే మారింది.
టాపిక్