Babar Azam: కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన పాక్ కెప్టెన్ బాబర్ అజామ్-pakistan captain babar azam breaks kohlis record in oneday cricket ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Babar Azam: కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన పాక్ కెప్టెన్ బాబర్ అజామ్

Babar Azam: కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన పాక్ కెప్టెన్ బాబర్ అజామ్

Nelki Naresh Kumar HT Telugu
Jun 09, 2022 10:28 AM IST

బాబర్ అజామ్ సూపర్ సెంచరీతో బుధవారం విండీస్ పై ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్ విజయాన్ని అందుకున్నది. ఈ మ్యాచ్ తో కోహ్లి రికార్డును బాబర్ అజామ్ అధిగమించాడు. అదేమిటంటే...

బాబర్ అజామ్
బాబర్ అజామ్ (twitter)

బాబర్ అజామ్ బ్యాటింగ్ జోరుతో బుధవారం వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్నది. ఈ మ్యాచ్ లో బాబర్ అజామ్ 107 బాల్స్ లో 103 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు పలు రికార్డులను బద్దలు కొట్టాడు. ఇంటర్ నేషనల్ క్రికెట్ లో 17 ఇన్నింగ్స్ లలో 1000 పరుగులు పూర్తి చేసిన కెప్టెన్ గా కోహ్లి రికార్డును విండీస్ తో జరిగిన మ్యాచ్ తో బాబర్ అజామ్ తిరగరాశాడు. కేవలం 13 ఇన్నింగ్స్ లలోనే బాబర్ అజామ్ వెయ్యి పరుగులు పూర్తి చేశాడు.

1000 పరుగులు మార్కుకు ఏబీ డివిలియర్స్ కు 20 ఇన్నింగ్స్ లు పట్టగా, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు 23 ఇన్నింగ్స్ లు అవసరమయ్యాయి. బాబర్ అజామ్ కు వరుసగా మూడో సెంచరీ ఇది. 2016 తర్వాత మరోసారి ఈ ఘనతను అందుకొని చరిత్రను సృష్టించాడు. వన్డే క్రికెట్ లో రేర్ ఫీట్ ను రిపీట్ చేసిన ఏకైక క్రికెట్ అతడే కావడం గమనార్హం.

ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో చివరి రెండు వన్డేల్లో బాబర్ అజామ్ సెంచరీలు సాధించాడు. విండీస్ తో బుధవారం జరిగిన మ్యాచ్ లో మూడు సెంచరీతో తన ఫామ్ ను కొనసాగించాడు. అంతే బాబర్ అజామ్ వన్డేల్లో పదిహేడవ సెంచరీ ఇది. 87 వన్డేల్లో 59 యావరేజ్ తో 4364 పరుగులు చేశాడు బాబర్ అజామ్.

 

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్