Ned vs Pak: చివరి వన్డేలో పాకిస్థాన్‌కు చెమటలు పట్టించిన నెదర్లాండ్స్‌-pakistan beat netherlands by 9 runs in third odi to clean sweep the series ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ned Vs Pak: చివరి వన్డేలో పాకిస్థాన్‌కు చెమటలు పట్టించిన నెదర్లాండ్స్‌

Ned vs Pak: చివరి వన్డేలో పాకిస్థాన్‌కు చెమటలు పట్టించిన నెదర్లాండ్స్‌

Hari Prasad S HT Telugu
Aug 22, 2022 06:28 AM IST

Ned vs Pak: పాకిస్థాన్‌కు పసికూన నెదర్లాండ్స్‌ చెమటలు పట్టించింది. ఈ సిరీస్‌ను పాక్‌ క్లీన్‌స్వీప్‌ చేసినా.. చివరి వన్డేలో నెదర్లాండ్స్‌ పోరాడిన తీరు మాత్రం అద్భుతమనే చెప్పాలి.

నెదర్లాండ్స్ పై గెలిచిన ట్రోఫీతో పాకిస్థాన్
నెదర్లాండ్స్ పై గెలిచిన ట్రోఫీతో పాకిస్థాన్ (Twitter)

రోటెర్‌డామ్‌: పాకిస్థాన్‌కు చివరి వన్డేలో చుక్కలు చూపించింది నెదర్లాండ్స్‌. ఆదివారం జరిగిన మూడో వన్డేలో పాక్‌ కేవలం 9 పరుగుల తేడాతో గట్టెక్కి ఊపిరి పీల్చుకుంది. ఈ సిరీస్‌ను చివరికి 3-0తో పాక్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. అయితే మూడో వన్డేలో నెదర్లాండ్స్‌ మొదట బాల్‌తో, తర్వాత బ్యాట్‌తో అద్భుతంగా పోరాడి గెలిచినంత పని చేసింది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ 49.4 ఓవర్లలో కేవలం 206 రన్స్‌కే ఆలౌటైంది. ఆ తర్వాత చేజింగ్‌లోనూ నెదర్లాండ్స్‌ పోరాడింది. ఒక దశలో 37 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయినా.. ఓపెనర్‌ విక్రమ్‌జీత్‌ సింగ్(50), మిడిలార్డర్‌ బ్యాటర్‌ టామ్‌ కూపర్‌(62) హాఫ్‌ సెంచరీలతో ఆదుకున్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 71 రన్స్‌ జోడించారు. దీంతో నెదర్లాండ్స్‌కు విజయపై ఆశలు కలిగాయి.

అయితే మొదట 108 రన్స్‌ దగ్గర విక్రమ్‌జీత్‌ సింగ్, 174 రన్స్‌ దగ్గర టామ్‌ కూపర్‌ ఔట్‌ కావడంతో నెదర్లాండ్స్‌ ఇక నిలవలేకపోయింది. లోయర్‌ మిడిలార్డర్‌, టెయిలెండర్లు విఫలమవడంతో చివరికి 49.2 ఓవర్లలో 197 రన్స్‌కు ఆలౌటైంది. పాక్‌ బౌలర్‌ నసీమ్‌ షా 33 రన్స్‌ ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. అంతకుముందు పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం 91 రన్స్‌తో ఒంటరి పోరాటం చేయడంతో పాకిస్థాన్‌ ఆ మాత్రం స్కోరైనా చేసింది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్