Nathan Lyon: టెస్టుల్లో షేన్ వార్న్ రికార్డ్ ను సమం చేసిన నాథన్ లైయన్....ఈ రికార్డ్ ఏదంటే..
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ లు నాథన్ లైయన్(nathan lyon) విజృంభించాడు. ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టడంతో ఆతిథ్య శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 212 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ ద్వారా షేన్ వార్న్ రికార్డునులైయన్ సమం చేశాడు. ఆ రికార్డ్ ఏమిటంటే...
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లైయన్ ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. అతడి బౌలింగ్ జోరుకు ఆతిథ్య శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 212 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో 25 ఓవర్లు వేసిన లైయన్ తొంభై పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో అతడు షేన్ వార్న్(shane warne) రికార్డును సమం చేశాడు. ఆసియా గడ్డపై అత్యధిక సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనను చేసిన స్పిన్నర్ గా షేర్ వార్న్ తో సమానంగా టాప్ ప్లేస్ లో నిలిచాడు.
ఆసియా గడ్డపై షేన్ వార్న్ తొమ్మిది సార్లు ఈ ఘనతను సాధించాడు. శ్రీలంకతో మ్యాచ్ ద్వారా లైయన్ కూడా షేన్ వార్న్ తో సమానంగా నిలిచాడు. మొత్తంలో టెస్టుల్లో లైయన్ ఐదు వికెట్ల ప్రదర్శనను చేయడం ఇది 20వ సారి కావడం గమనార్హం. టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన బౌలర్లలో వెటోరి, అలెన్ డోనల్డ్ తో కలిసి లైయన్ 22 వస్థానంలో నిలిచాడు.
ఈ జాబితాలో ఇంగ్లాండ్ పేసర్ అండర్సన్ 31 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనతో మొదటి స్థానంలో ఉన్నాడు. అతడి తర్వాత స్థానంలో అశ్విన్ (30 సార్లు) నిలిచాడు. కాగా తొలి టెస్ట్ లో శ్రీలంక 212 పరుగులకు ఆలౌట్ అయ్యింది. డిక్వెలా 58, మాథ్యూస్ 39, మెండిస్ 22 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి తొంభై ఎనిమిది పరుగులు చేసింది.
సంబంధిత కథనం
టాపిక్