Mitchell Starc Ruled Out: ఆస్ట్రేలియాకు షాక్.. గాయంతో మిచెల్ స్టార్క్ ఔట్-mitchell starc ruled out of first test against india on february 9th ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Mitchell Starc Ruled Out: ఆస్ట్రేలియాకు షాక్.. గాయంతో మిచెల్ స్టార్క్ ఔట్

Mitchell Starc Ruled Out: ఆస్ట్రేలియాకు షాక్.. గాయంతో మిచెల్ స్టార్క్ ఔట్

Hari Prasad S HT Telugu
Jan 31, 2023 09:45 AM IST

Mitchell Starc Ruled Out: ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. గాయంతో ఆ టీమ్ స్టార్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ తొలి టెస్ట్ ఆడటం లేదు. ఈ విషయాన్ని అతడే వెల్లడించాడు.

మిచెల్ స్టార్క్
మిచెల్ స్టార్క్ (AFP)

Mitchell Starc Ruled Out: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్ ఆడటానికి ఇండియాకు రానుంది ఆస్ట్రేలియా టీమ్. చాలా రోజులుగా ఇండియా దగ్గరే ఉన్న ఈ ట్రోఫీని ఎగరేసుకుపోవాలని ఆ టీమ్ పట్టుదలతో ఉంది. హోమ్ సీజన్ లో వరుస విజయాలు సాధించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టేబుల్లో టాప్ లో ఉన్న ఆ టీమ్.. 2004 తర్వాత తొలిసారి ఇండియా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవాలని చూస్తోంది.

అయితే సిరీస్ ప్రారంభానికి ముందే ఆ టీమ్ కు షాక్ తగిలింది. స్టార్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ గాయం కారణంగా తొలి టెస్ట్ ఆడటం లేదు. గతేడాది అతని చేతి వేలికి గాయమైంది. దీని నుంచి తాను ఇంకా కోలుకుంటున్నానని, తొలి టెస్ట్ ఆడబోవడం లేదని అతడు వెల్లడంచాడు. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా స్టార్క్ గాయపడ్డాడు. దీంతో ఆ టీమ్ తో జరిగిన మూడో టెస్టుకు దూరంగా ఉన్నాడు.

తాజాగా ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డుల్లో స్టార్క్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా హోస్ట్ అతన్ని గాయం గురించి ప్రశ్నించగా.. ఈ విషయం చెప్పాడు. "గాయం నుంచి కోలుకుంటున్నా. మరో రెండు వారాలు పడుతుంది. బహుశా అప్పుడు ఢిల్లీలో ఉండబోయే మా టీమ్ మేట్స్ తో నేను కలుస్తానని అనుకుంటున్నా. అప్పటికే వాళ్లు తొలి టెస్ట్ విజయం సాధిస్తారని భావిస్తున్నా. అప్పటి నుంచి ట్రైనింగ్ ప్రారంభిస్తా" అని స్టార్క్ అన్నాడు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫిబ్రవరి 9న ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ నాగ్‌పూర్ లో జరగనుంది. ఆ తర్వాత రెండో టెస్ట్ ఢిల్లీలో, మూడో టెస్ట్ ధర్మశాల, నాలుగో టెస్ట్ అహ్మదాబాద్ లలో జరుగుతాయి. ఇండియాలో సిరీస్ అంటే తమకు సవాలే అని స్టార్క్ చెప్పాడు.

"ఇండియాలో కండిషన్స్ నుంచి ఏం ఆశించవచ్చో ఎప్పుడూ అంచనా వేయలేం. అయితే అక్కడ బంతి టర్న్ అవుతుందని మాత్రం మాకు తెలుసు. ఆట ప్రారంభమయ్యేంత వరకూ లేదంటే ఏ వికెట్ పై ఆడుతున్నామో తెలిసేంత వరకూ ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకే ఇదో గొప్ప సవాలు" అని ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డుల్లో పాల్గొన్న స్టార్క్ అన్నాడు.

"ఇండియా టూర్ కు వెళ్లే ముందు టీమ్ మంచి పొజిషన్ లో ఉంది. ఓవైపు మహిళల టీమ్ వరల్డ్ కప్ కోసం వెళ్తుంటే.. మేము ఇండియా టూర్ కు వెళ్తున్నాం. వచ్చే రెండు నెలల్లో మంచి క్రికెట్ చూసే అవకాశం కలుగుతుంది. ఆస్ట్రేలియాకు మంచి సక్సెస్ దక్కాలని ఆశిస్తున్నా" అని స్టార్క్ అన్నాడు.

WhatsApp channel

సంబంధిత కథనం