Messi The GOAT: మెస్సీ 808 గోల్స్.. 808 మేకలతో ట్రిబ్యూట్-messi the goat gets rare tribute with 808 goats ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Messi The Goat: మెస్సీ 808 గోల్స్.. 808 మేకలతో ట్రిబ్యూట్

Messi The GOAT: మెస్సీ 808 గోల్స్.. 808 మేకలతో ట్రిబ్యూట్

Hari Prasad S HT Telugu
Jul 24, 2023 02:11 PM IST

Messi GOAT: మెస్సీ 808 గోల్స్ కు 808 మేకలతో ట్రిబ్యూట్ ఇచ్చింది లేస్ చిప్స్ కంపెనీ. అతడు ఇంటర్ మియామీ టీమ్ తరఫున తొలి గోల్ చేసిన తర్వాత ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది.

లియోనెల్ మెస్సీకి లేస్ ట్రిబ్యూట్
లియోనెల్ మెస్సీకి లేస్ ట్రిబ్యూట్

Messi GOAT: ఫుట్‌బాల్ స్టార్ లియెనెల్ మెస్సీకి కాస్త భిన్నంగా ట్రిబ్యూట్ ఇచ్చింది ప్రముఖ చిప్స్ కంపెనీ లేస్. ఇంగ్లిష్ లో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ని షార్ట్ గా గోట్ (G.O.A.T) అంటారని తెలుసు కదా. సాధారణంగా సోషల్ మీడియాలోనూ ఎవరైనా ప్రముఖుడిని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గా చెప్పాలనుకున్నప్పుడు గోట్ ఫొటోను సింబాలిక్ గా వాడుతారు.

అలా లేస్ కూడా ఓ ప్రత్యేకమైన వీడియో రూపొందించింది. మెస్సీ తన కెరీర్లో 808వ గోల్ చేసిన తర్వాత అవే 808 మేకలతో మెస్సీ రూపం వచ్చేలో ఓ అద్భుతమైన ఫొటోను క్రియేట్ చేసింది. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. నలుపు, తెలుపు రంగుల్లో ఉన్న 808 మేకలతో మెస్సీ రూపాన్ని క్రియేట్ చేసింది. ఈ అర్జెంటీనా స్టార్ ప్లేయర్ ఈ మధ్యే ఇంటర్ మియామీ క్లబ్ తరఫున తన తొలి మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్ లోనే అతడు ఆ క్లబ్ తరఫున తొలి గోల్ చేశాడు. లీగ్స్ కప్ లో భాగంగా క్రజ్ అజుల్ తో జరిగిన మ్యాచ్ లో సబ్‌స్టిట్యూట్ గా బరిలోకి దిగాడు మెస్సీ. 94వ నిమిషంలో గోల్ పోస్ట్ కు 75 అడుగుల దూరం నుంచి మెస్సీ చేసిన గోల్ తో ఈ మ్యాచ్ లో ఇంటర్ మియామీ 2-1తో విజయం సాధించింది. మెస్సీ కెరీర్లో ఇది 808వ గోల్ కావడం విశేషం.

దీంతో మెస్సీకి ట్రిబ్యూట్ అందిస్తూనే లేస్ తన చిప్స్ యాడ్ రూపొందించింది. ఇందులో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (G.O.A.T)కు అవే గోట్స్ తో ట్రిబ్యూట్ ఇవ్వడం విశేషం. ఈ వీడియోలో 808 మేకలను సరిగ్గా మెస్సీ ముఖం వచ్చేలా నిల్చోబెట్టారు. వాటిని పై నుంచి చూస్తే మెస్సీ ముఖం స్పష్టంగా కనిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత కథనం

టాపిక్