Rinku Singh Ipl Records: ధనాధన్ ఇన్నింగ్స్‌తో పలు రికార్డులు బ్రేక్ చేసిన రింకు సింగ్ - ఆ రికార్డులు ఏవంటే...
Rinku Singh Ipl Records: గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో ఐదు బాల్స్‌లో ఐదు సిక్సర్లు కొట్టి కోల్‌కతాకు అద్భుత విజయాన్ని అందించాడు రింకు సింగ్. ఈ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో టీ20 క్రికెట్‌లో పలు రికార్డులను తిరగరాశాడు.
Rinku Singh Ipl Records: గుజరాత్ తో జరిగిన పోరులో చివరి ఓవర్‌లో ఐదు సిక్సర్లు కొట్టి కోల్‌కతాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు రింకు సింగ్. కోల్‌కతా ఓటమి ఖరారైన తరుణంలో చివరి ఓవర్‌లో 29 పరుగులు అవసరం కాగా రింకు సింగ్ అద్భుతమే చేశాడు. అతడి జోరుతో కోల్‌కతా చివరి బాల్‌కు విజయాన్ని అందుకున్నది.
చివరి ఓవర్‌లో 31 పరుగులు చేసిన రింకు సింగ్ పలు రికార్డులను తిరగరాశాడు. టీ20 క్రికెట్‌లో లాస్ట్ ఓవర్‌లో ఓ టీమ్ ఛేదించిన అత్యధిక టార్గెట్ ఇదే కావడం గమనార్హం. గతంలో దక్కన్ ఛార్జర్స్ 2009లో కోల్‌కతాపై చివరి ఓవర్‌లో 21 పరుగులు అవసరం కాగా 26 పరుగులు చేసి చివరి ఓవర్‌లో విజయాన్ని అందుకున్నది. ఆ రికార్డ్‌ను గుజరాత్‌తో మ్యాచ్ ద్వారా కోల్‌కతా ఛేదించింది.
అంతే కాకుండా చివరి ఓవర్‌లో ఛేజింగ్‌లో 30కిపైగా పరుగులు చేసిన రెండో జట్టుగా కోల్‌కతా నిలిచింది. గతంలో కెంట్ టీమ్‌పై సోమర్‌సెట్ చివరి ఓవర్‌లో 34 పరుగులు చేసింది. అంతే కాకుండా చివరి రెండు ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్స్‌గా రింకు సింగ్ నిలిచాడు.
ఈ జాబితాలో జడేజా, కోహ్లి 44 పరుగులతో ఫస్ట్, సెకండ్ ప్లేస్‌లో ఉండగా 42 రన్స్‌తో రాహుల్ మూడో స్థానంలో ఉన్నాడు. 41 పరుగులతో రింకు సింగ్, విజయ్ శంకర్ నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. రింకు దెబ్బకు చివరి ఓవర్ వేసిన గుజరాత్ బౌలర్ యశ్ దయాల్ ఖాతాలో చెత్త రికార్డ్ చేరింది.
ఐపీఎల్‌లో నాలుగు ఓవర్లు వేసి అత్యధిక పరుగులు (69 రన్స్) సమర్పించుకున్న రెండో బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో బాసిల్ థంపీ 70 పరుగులతో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.
టాపిక్