IPL 2023 Points Table: ప‌ర్పుల్ క్యాప్ రేసులో ష‌మీ టాప్ - గుజ‌రాత్ టైటాన్స్‌ ఫ‌స్ట్ ప్లేస్‌కు ఢోకా లేన‌ట్లే-ipl 2023 points table shami jumps to top spot in purple cap race ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023 Points Table: ప‌ర్పుల్ క్యాప్ రేసులో ష‌మీ టాప్ - గుజ‌రాత్ టైటాన్స్‌ ఫ‌స్ట్ ప్లేస్‌కు ఢోకా లేన‌ట్లే

IPL 2023 Points Table: ప‌ర్పుల్ క్యాప్ రేసులో ష‌మీ టాప్ - గుజ‌రాత్ టైటాన్స్‌ ఫ‌స్ట్ ప్లేస్‌కు ఢోకా లేన‌ట్లే

Nelki Naresh Kumar HT Telugu
May 06, 2023 09:29 AM IST

IPL 2023 Points Table: ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌ ఆధిప‌త్యం కొన‌సాగుతోంది. పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో ఉంది ఈ జ‌ట్టు. అంతే కాకుండా ప‌ర్పుల్ కాప్ రేసులో గుజ‌రాత్ బౌల‌ర్లు ష‌మీ, ర‌షీద్ టాప్ టూలో కొన‌సాగుతోన్నారు.

ష‌మీ
ష‌మీ

IPL 2023 Points Table: రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌పై అద్భుత విజ‌యంతో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌ త‌న నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌ను మ‌రింత ప‌టిష్టం చేసుకున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు ప‌ది మ్యాచ్‌లు ఆడిన గుజ‌రాత్ టైటాన్స్ ఏడు విజ‌యాలు, మూడు ఓట‌ముల‌తో 14 పాయింట్లు ద‌క్కించుకొని టాప్ ప్లేస్‌లో నిలిచింది.

10 మ్యాచుల్లో ఐదు విజ‌యాల‌తో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ సెకండ్ ప్లేస్‌లో కొన‌సాగుతోంది. చెన్నై మూడు, రాజ‌స్థాన్ నాలుగు స్థానంలో ఉన్నాయి. ఐదో స్థానంలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌ బెంగ‌ళూరు, ఆరో స్థానంలో ముంబై, ఏడో స్థానంలో పంజాబ్ కొన‌సాగుతోన్నాయి. చివ‌రి మూడు స్థానాల్లో కోల్‌క‌తా, స‌న్‌రైజ‌ర్స్‌, ఢిల్లీ నిలిచాయి.

ఆరెంజ్ క్యాప్‌లో డుప్లెసిస్ టాప్

ఆరెంజ్ క్యాప్ రేసులో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కెప్టెన్ డుప్లెసిస్ టాప్ ప్లేస్‌లో కొన‌సాగుతోన్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన డుప్లెసిస్ 466 ర‌న్స్ చేశాడు. 442 ర‌న్స్‌తో రాజ‌స్థాన్ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. మూడో స్థానంలో డేవాన్ కాన్వే (414 ర‌న్స్‌), నాలుగో స్థానంలో శుభ్‌మ‌న్ గిల్ (375 ర‌న్స్‌), ఐదో ప్లేస్‌లో కోహ్లి (364 ర‌న్స్‌) కొన‌సాగుతోన్నారు.

ప‌ర్పుల్ క్యాప్ లో ష‌మీ నంబ‌ర్ వ‌న్‌

ప‌ర్పుల్ క్యాప్ రేసులో గుజ‌రాత్ బౌల‌ర్లు ష‌మీ నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో నిల‌వ‌గా ర‌షీద్‌ఖాన్ రెండో స్థానాన్ని ద‌క్కించుకున్నాడు.త‌లో 18 వికెట్ల‌తో ఈ ఇద్ద‌రు టాప్ టూ ప్లేస్‌ల‌లో కొన‌సాగుతోన్నారు. మూడో స్థానంలో చెన్నై పేస‌ర్ తుషార్ దేశ్‌పాండ్ (17 వికెట్లు). నాలుగో ప్లేస్‌లో అర్ష‌దీప్ సింగ్ (16 వికెట్లు), ఐదో స్థానంలో పీయూష్ చావ్లా (15 వికెట్లు) ఉన్నారు.

ప‌ర్పుల్ క్యాప్ టేబుల్‌
ప‌ర్పుల్ క్యాప్ టేబుల్‌
WhatsApp channel