IPL | ఐపీఎల్‌ను ఏ లీగూ అందుకోలేదు.. పీఎస్ఎల్‌తో పోల్చడం సరికాదు: ఆకాశ్ చోప్రా
పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రజా ఐపీఎల్‌తో పీఎస్ఎల్‌ను పోల్చడాన్నికి భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా తప్పు పట్టారు. ఈ రెండు సూపర్ లీగులను పోల్చడాన్ని సరికాదని వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ సూపర్ లీగ్‌ను(PSL) ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో పోలుస్తూ దాయాది దేశ క్రికెట్ బోర్టు ఛైర్మన్ రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా స్పందించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందుతున్న ఐపీఎల్‌తో పీఎస్ఎల్‌ను పోల్చడాన్ని తప్పుపట్టాడు. బ్రాండ్ వ్యాల్యూ, వ్యూస్ పరంగా పీఎస్ఎల్ మాత్రమే కాదు.. బిగ్‌బాష్ సూపర్ లీగ్ కూడా ఐపీఎల్ స్థాయికి చేరుకోవడం కష్టమని స్పష్టం చేశాడు.
ప్రసార హక్కుల కోసం ఖర్చు పెట్టే డబ్బు చూస్తేనే ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్‌కు సరిపోలే మరో లీగ్ కనిపించదు. ఆటగాళ్లను కొనుగోలు చేయడం, వారి కోసం ఒక్కో ఫ్రాంచైజీ ఖర్చు పెట్టే నగదు, జట్ల విలువ లాంటివన్నీ ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. ఇవన్నీ వేర్వేరు కాదు. అందుకే ఐపీఎల్ విలువ చాలా ఎక్కువ అని స్పష్టం చేస్తున్నా. ఒకవేళ మీరు(రమీజ్ రాజా) పీఎస్ఎల్‌లో వేలం నిర్వహిస్తే రూ.16 కోట్లతో ఆడే ఆటగాడిని చూడటం కష్టం. అని ఆకాశ్ చోప్రా రమీజ్ రాజాకు కౌంటర్ ఇచ్చారు.
అంతేకాకుండా2018 నుంచి 2022 వరకు ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారే బీసీసీఐ రూ.16,375 కోట్లను సొంతం చేసుకుందని, 2023-2027 టర్మ్ కోసం రూ.50 వేల కోట్ల వరకు కేటాయించేందుకు పలు సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
2016లో పాక్ క్రికెట్ బోర్డు పీఎస్ఎల్‌ను ప్రారంభించింది. ఆరు జట్లు డ్రాఫ్ట్ మోడ్‌లో ఆటగాళ్లను ఎంచుకును ధరను నిర్ణయించి ఒప్పందం కుదుర్చుకుంటాయి. అయితే ఐపీఎల్ వేలంలోకి వెళ్లడం వల్ల ఫ్రాంచైజీల పోటీ నేపథ్యంలో భారీ ధరను అందుకుంటారు. ఈ విషయం గురించే పీసీబీ ఛైర్మన్ రమీజ్ రజా ప్రస్తావిస్తూ.. పీఎస్ఎల్‌లోని ఆటగాళ్లకు వేలం నిర్వహిస్తే ఐపీఎల్ కంటే భారీ ధరు దక్కించుకుంటారని, అప్పుడు పీఎస్ఎల్‌ను కాదని ఐపీఎల్‌లో ఎవరు ఆడరని వ్యాఖ్యనించారు.
సంబంధిత కథనం
టాపిక్