WTC Final IND vs AUS: డబ్ల్యూటీసీ ఫైనల్ డ్రా అయితే విజేతగా ఎవరు నిలుస్తారంటే?
WTC Final IND vs AUS: జూన్ 7వ తేదీ నుంచి ఇండియా, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ ఫైనల్ డ్రా అయితే విజేతగా ఎవరికి ప్రకటిస్తారంటే....
WTC Final IND vs AUS: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ సమరం మరో ఐదు రోజుల్లో మొదలుకానుంది. లండన్‌లోని ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ ఫైనల్ కోసం ఇప్పటికే లండన్ చేరుకున్న ఇరు జట్లు ముమ్మరంగా సాధన చేస్తోన్నాయి.
ఐపీఎల్‌తో రెండు నెలల పాటు తీరిక లేకుండా ఉన్న టీమ్ ఇండియా ఆటగాళ్లు ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్‌పై దృష్టిసారించారు. కోహ్లి, రోహిత్‌తో పాటు మిగిలిన ఆటగాళ్లు అందరూ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోన్నారు. మరోవైపు ఆస్ట్రేలియా కూడా వరల్డ్ టెస్ట్ చాంఫియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకునేందుకు ప్రణాళికల్ని రచిస్తోంది.
మ్యాచ్ డ్రా అయితే...
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ డ్రాగా ముగిస్తే ఇండియా, ఆస్ట్రేలియాలను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ఇరు జట్లకు కప్‌ను అందజేస్తారు. ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్‌లో విజేతగా నిలిచిన జట్టుకు 13.22 కోట్లు ప్రైజ్‌మనీని అందజేస్తున్నారు. రన్నరప్‌కు 6.61 కోట్లు దక్కనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మొదలైన తర్వాత జరుగనున్న రెండో ఫైనల్ ఇది.
రెండు సీజన్స్‌లో ఇండియా ఫైనల్స్‌కు చేరుకొని చరిత్రను సృష్టించింది. గత సీజన్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలై రన్నరప్‌తో సరిపెట్టుకున్నది. ఈ సారి విజేతగా నిలవాలనే పట్టుదలతో టీమ్ ఇండియా ఉంది.