Dinesh Karthik: నాకు మైండ్ రీడింగ్ పవర్ ఉంటే ధోనీ మైండ్‌ను రీడ్ చేస్తా: కార్తీక్
ఐపీఎల్ తర్వాత ఇండియన్ క్రికెట్‌లో దినేష్ కార్తీక్ పేరు మార్మోగిపోతోంది. రిటైర్మెంట్ వయసులో ఇప్పుడతను కొత్త సెన్సేషన్‌గా మారిపోవడం విశేషం.
కటక్: ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున బెస్ట్ ఫినిషర్‌గా మారిన దినేష్ కార్తీక్ అదే ఊపులో మూడేళ్ల తర్వాత టీమిండియాలోకి వచ్చాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో అతనికి ఆడే అవకాశం పెద్దగా రాకపోయినా.. తర్వాతి మ్యాచ్‌ల కోసం కార్తీక్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఆదివారం సౌతాఫ్రికాతో రెండో టీ20కి ముందు కార్తీక్ ఓ ఫన్నీ గేమ్‌లో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
తాను ఇష్టంగా చేసే పనులేవి? ఇదా లేక అదా? ప్రశ్నలు వెంటవెంటనే అడుగుతూ వెళ్తుంటే.. పెద్దగా టైమ్ తీసుకోకుండానే ఠకీమని సమాధానం చెప్పాలి. ఇందులో భాగంగా అతన్ని కొన్ని ఫన్నీ ప్రశ్నలు అడిగారు. టీ అంటే ఇష్టమా లేక కాఫీయా అని అడిగితే.. తనకు టీ అంటేనే ఇష్టమని అతను అన్నాడు. వంట చేయడం ఇష్టమా, క్లీనింగ్ చేయడమా అని అడిగితే.. క్లీనింగ్‌కే ఓటేశాడు.
ఇక ఏ స్పోర్ట్స్ స్టార్‌తో కలిసి లంచ్‌కు వెళ్తావ్ అన్న ప్రశ్నకు టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ పేరు చెప్పాడు. ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తూ.. అది ఎందుకు ఇష్టమో కూడా కార్తీక్ వివరించాడు. ఇక నీకు ఎగిరే సామర్థ్యం లేదంటే మనుషుల మైండ్‌ను చదివే సామర్థ్యం ఇస్తే ఏం చేస్తావ్ అని అడిగిన ప్రశ్నకు కార్తీక్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు.
తనకు ఎగిరే సామర్థ్యం ఇస్తే వెంటనే అలస్కాకు ఎగురుకుంటూ వెళ్లిపోతానని, ఆ ప్రదేశం గురించి తాను చాలా విన్నానని కార్తీక్ చెప్పాడు. ఇక మైండ్ రీడ్ చేసే అవకాశం వస్తే తాను కచ్చితంగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ మైండ్‌లోకి దూరిపోతానని చెప్పడం విశేషం.
సంబంధిత కథనం