Harmanpreet Kaur | వరల్డ్‌కప్‌లో చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్
మహిళల వరల్డ్‌కప్‌లో ఇండియన్ టీమ్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె సెంచరీ బాదిన విషయం తెలిసిందే.
హామిల్టన్: వెస్టిండీస్‌తో జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ చెలరేగారు. ఈ ఇద్దరూ సెంచరీల మోత మోగించారు. నాలుగో వికెట్‌కు ఏకంగా 184 పరుగులు జోడించి రికార్డు సృష్టించారు. అయితే ఈ క్రమంలో హర్మన్‌ప్రీత్ కొత్త చరిత్ర సృష్టించింది. హర్మన్‌కు వన్డేల్లో ఇది వన్డేల్లో నాలుగో సెంచరీ కాగా.. వరల్డ్‌కప్‌లో మూడో సెంచరీ. వరల్డ్‌కప్‌లో ఇండియా తరఫున అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్ నిలిచింది.
ఈ మ్యాచ్‌లో హర్మన్ 107 బాల్స్‌లో 109 రన్స్ చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. హర్మన్ గతంలో వరల్డ్‌కప్‌లలో రెండు సెంచరీలు చేసింది. ఇందులో 2017 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై కళ్లు చెందిరే సెంచరీ కూడా ఉంది. ఆ మ్యాచ్‌లో హర్మన్ కేవలం 115 బంతుల్లో 171 రన్స్ చేయడంతో 36 పరుగులతో ఇండియా గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది.
మరోవైపు శనివారం జరిగిన మ్యాచ్‌లో స్మృతి మంధానా కూడా సెంచరీతో చెలరేగింది. ఆమెకు వన్డేల్లో ఇది ఐదో సెంచరీ. మంధాన 119 బంతుల్లో 123 పరుగులు చేసింది. స్మృతి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. ఇక హర్మన్‌తో నాలుగో వికెట్‌కు 184 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన విషయం తెలిసిందే. ఇది వరల్డ్‌కప్‌లో ఇండియా తరఫున ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.
సంబంధిత కథనం