David Warner Delhi Capitals: ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్సీ రేసులో వార్న‌ర్ - అక్ష‌ర్‌కు ఛాన్స్‌-david warner likely to lead delhi capitals in ipl 2023 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  David Warner Delhi Capitals: ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్సీ రేసులో వార్న‌ర్ - అక్ష‌ర్‌కు ఛాన్స్‌

David Warner Delhi Capitals: ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్సీ రేసులో వార్న‌ర్ - అక్ష‌ర్‌కు ఛాన్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Mar 16, 2023 08:07 AM IST

David Warner Delhi Capitals: ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు కెప్టెన్‌గా డేవిడ్ వార్న‌ర్ ఎంపిక ఖాయంగానే క‌నిపిస్తోంది. రిష‌బ్ పంత్ గాయ‌ప‌డ‌టంతో అత‌డి స్థానంలో వార్న‌ర్‌కు సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

డేవిడ్ వార్న‌ర్
డేవిడ్ వార్న‌ర్

David Warner Delhi Capitals: ఐపీఎల్ 2023లో కొత్త కెప్టెన్‌తో బ‌రిలో దిగ‌నుంది ఢిల్లీ క్యాపిట‌ల్స్‌. గ‌త సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు సార‌థిగా వ్య‌వ‌హ‌రించిన రిష‌బ్ పంత్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ‌టంతో ఐపీఎల్‌కు దూర‌మైన సంగ‌తి తెలిసిందే. దాంతో అత‌డి స్థానంలో డేవిడ్ వార్న‌ర్‌కు కెప్టెన్సీ బాధ్య‌త‌ల్ని అప్ప‌గించాల‌ని మేనేజ్‌మెంట్‌తో పాటు కోచ్ రికీ పాంటింగ్ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

వార్న‌ర్‌తో పాటు కెప్టెన్సీ రేసులో అక్ష‌ర్ ప‌టేల్ పేరు ప్ర‌చారంలో ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వార్న‌ర్‌కు ఉన్న సుదీర్ఘ అనుభ‌వం దృష్ట్యా అత‌డికే సార‌థ్య బాధ్య‌త‌ల్ని అప్ప‌గిస్తే బాగుంటుంద‌నే ఆలోచ‌న‌లో కోచ్ రికీ పాంటింగ్ ఉన్న‌ట్లు చెబుతోన్నారు. త్వ‌ర‌లోనే కెప్టెన్‌గా వార్న‌ర్ పేరును అఫిషీయ‌ల్‌గా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఢిల్లీ టీమ్‌కు వార్న‌ర్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం కొత్తేమీ కాదు. వార్న‌ర్ ఐపీఎల్ కెరీర్ ఢిల్లీ టీమ్‌తోనే మొద‌లైంది. 2009 నుంచి 2013 వ‌ర‌కు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు వార్న‌ర్ ప్రాతినిథ్యం వ‌హించాడు. ఆ స‌మ‌యంలో ప‌లు మ్యాచ్‌ల‌కు తాత్కాలిక కెప్టెన్‌గా వార్న‌ర్ ప‌నిచేశాడు.

2014లో స‌న్‌రైజ‌ర్స్ టీమ్ అత‌డిని కొనుగోలు చేసింది. ప‌లు సీజ‌న్స్‌లో స‌న్‌రైజ‌ర్స్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన వార్న‌ర్ 2016లో ఐపీఎల్ టైటిల్ అందించాడు. ఐపీఎల్ లో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్స్‌లో ఒక‌రిగా వార్న‌ర్ నిలిచాడు.

WhatsApp channel