Warner to RRR Team: గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలిచి తెలుగు వాళ్లంతా గర్వపడేలా చేసిన ఆర్‌ఆర్‌ఆర్ మూవీ టీమ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశ ప్రధాని మోదీతోపాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు కూడా ఈ మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పారు. అంతేకాదు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా స్పెషల్ మెసేజ్ ఇవ్వడం విశేషం.,ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు ఆడిన సమయంలో తెలుగు సినిమాలు, హీరోలకు బాగా దగ్గరైన వార్నర్.. ఆర్‌ఆర్‌ఆర్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వార్త తెలియగానే ట్విటర్ ద్వారా స్పందించాడు. "అవార్డు సాధించినందుకు కంగ్రాట్స్ అండ్ వెల్‌డన్" అంటూ వార్నర్ ట్వీట్ చేశాడు. ఆర్‌ఆర్‌ఆర్ మూవీతోపాటు నాటు నాటు హ్యాష్‌ట్యాగ్‌లను జత చేశాడు.,సన్‌రైజర్స్ టీమ్‌కు ఆడిన సమయంలోనే వార్నర్ టాలీవుడ్‌పై మనసు పారేసుకున్నాడు. తెలుగు హీరోల డైలాగులు, పాటలకు ఎన్నో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కూడా చేశాడు. వీటి ద్వారా ఇక్కడి అభిమానులకు వార్నర్ మరింత దగ్గరయ్యాడు. ఇప్పుడు సన్‌రైజర్స్ టీమ్‌కు దూరమైనా సరే.. తెలుగు సినిమాపై ఉన్న మమకారం మాత్రం పోలేదు. అందుకే ఆర్‌ఆర్‌ఆర్‌కు అవార్డు రాగానే ఇలా కంగ్రాట్స్ చెప్పాడు.,అటు టీమిండియా మాజీ క్రికెటర్, హైదరాబాదీ అయిన వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పాడు. "నాటు నాటులాంటి పాటను అందించిన ఎంఎం కీరవాణి, రాజమౌళి, చంద్రబోస్, మొత్తం ఆర్ఆర్ఆర్ టీమ్‌కు శుభాకాంక్షలు. గోల్డెన్ గ్లోబ్స్ గెలిచి ప్రతి భారతీయున్ని గర్వంతో ఉప్పొంగేలా చేశారు. ఈ పాటలో అద్భుతంగా డ్యాన్స్ చేసిన తారక్, రామ్‌చరణ్‌లను మరవలేము" అని ట్విటర్ ద్వారా లక్ష్మణ్ స్పందించాడు.,గోల్డెన్ గ్లోబ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట అవార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే. చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ పాటను కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ సాంగ్‌లో చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సినిమా రిలీజ్ సందర్బంలోనూ ఈ పాటకు చాలా ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు ప్రతిష్టాత్మక ఆస్కార్స్‌లోనూ ఈ సాంగ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.,