Australia vs South Africa Boxing Day Test: గ్రీన్‌కు 5 వికెట్లు.. తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన సౌతాఫ్రికా
Australia vs South Africa Boxing Day Test: బాక్సింగ్ డే టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్ కామెరాన్ గ్రీన్ 5 వికెట్లు తీయడంతో సఫారీలు తొలి రోజు మొత్తం కూడా బ్యాటింగ్ చేయలేకపోయారు.
Australia vs South Africa Boxing Day Test: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు. టాప్, మిడిలార్డర్ విఫలమవడంతో 189 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్ కామెరాన్ గ్రీన్ 5 వికెట్లు తీసుకున్నాడు. ఒక దశలో 67 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయినా.. వికెట్ కీపర్ కైల్ వెరీన్ (52), ఆల్ రౌండర్ మార్కో జాన్సన్ (59) టీమ్‌ను ఆదుకున్నారు.
వీళ్లిద్దరూ ఆరో వికెట్‌కు ఏకంగా 112 పరుగులు జోడించారు. దీంతో సౌతాఫ్రికా ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. అయితే హాఫ్ సెంచరీ పూర్తవగానే వెరీన్ ఔటవడంతో మరోసారి సఫారీలు వరుసగా వికెట్లు కోల్పోయారు. చివరి ఐదు వికెట్లు 10 పరుగుల తేడాలోనే పడిపోయాయి. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ టెస్టుల్లో తొలిసారి ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసుకున్నాడు.
మిచెల్ స్టార్క్ 2, బోలాండ్, లయన్ చెరొక వికెట్ తీశారు. సౌతాఫ్రికా టాప్, మిడిలార్డర్ దారుణంగా విఫలమైంది. కెప్టెన్ ఎల్గార్ 26, మరో ఓపెనర్ సరెల్ ఎర్వీ 18, డి బ్రుయిన్ 12, టెంబా బవుమా 1, జోండో 5 రన్స్ మాత్రమే చేసి ఔటయ్యారు. 29 పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా.. స్కోరు 67కు చేరే సరికి సగం వికెట్లు కోల్పోయింది. వందలోపే ఆలౌటవుతుందా అనుకున్న సమయంలో వెరీన్, జాన్సన్ టీమ్‌ను ఆదుకున్నారు.
ఇక చివర్లో లోయర్ ఆర్డర్ కూడా ఏమాత్రం ఫైట్ చేయకుండానే చేతులెత్తేసింది. కేశవ్ మహరాజ్ 2, రబాడా 4, ఎంగిడి 2 పరుగులు మాత్రమే చేశారు. నోక్యా 1 పరుగు చేసి అజేయంగా ఉన్నాడు.