Aamir Khan | రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లోకి ఆమిర్ ఖాన్.. వచ్చే ఏడాది వస్తానంటున్న స్టార్!
లగాన్ మూవీతో ఆమిర్‌ఖాన్ బాలీవుడ్‌లో ఓ పెద్ద సంచలనమే సృష్టించాడు. దేశానికి స్వతంత్రం రాకమునుపు క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ కథలో కెప్టెన్‌గా ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అదరగొట్టాడు.
ఆమిర్ ఖాన్.. మా టీమ్‌లో చేరతావా అని రాజస్థాన రాయల్స్ టీమ్ సరదాగా చేసిన ట్వీట్‌కు ఈ బాలీవుడ్ నటుడు స్పందించాడు. మీ ఛాలెంజ్‌కు నేనే సిద్ధం .. కాకపోతే ఈ సీజన్‌లో కుదరదు కానీ వచ్చే సీజన్‌లో వస్తా అని ఆమిర్ చెప్పడం విశేషం. రాయల్స్ తన అధికారిక ట్విటర్ అకౌంట్లో ఈ మధ్య ఓ ట్వీట్ చేసింది. అందులో ఆమిర్ ఖాన్ లగాన్ సినిమాలోని పోస్టర్‌ను వాడుకుంది. అందులో ఆమిర్‌ఖాన్ ముఖానికి రాయల్స్ లోగో తగిలించి.. పక్కనే ఉన్న మరో వ్యక్తికి ఆమిర్ ముఖాన్ని అతికించారు. ఆమిర్.. ఆడతావా అని రాయల్స్ అతన్ని అడుగుతున్నట్లుగా ఈ ఫొటో క్రియేట్ చేశారు.
ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్‌తోపాటు స్టార్ స్పోర్ట్స్‌ను ట్యాగ్ చేశారు. తమకు 11వ ఆటగాడు దొరికేశాడంటూ సరదాగా ఓ కామెంట్ కూడా రాశారు. నిజానికి రాయల్స్ ఇలా చేయడం వెనుక మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. గత వారం ఆమిర్ ఖాన్ తన క్రికెటింగ్ స్కిల్స్‌ను చూపిస్తూ స్టార్ స్పోర్ట్స్‌ను తనకు ఐపీఎల్‌లో ఏమైనా ఛాన్స్ ఉందా అని సరదాగా అడిగాడు. ఈ వీడియోను కామెంటేటర్ రవిశాస్త్రికి చూపిస్తూ.. ఆమిర్ ఆట ఎలా ఉంది అని యాంకర్ జతిన్ సప్రు అడిగాడు. దీనికి రవిశాస్త్రి స్పందిస్తూ.. అంతా బాగానే ఉంది కానీ.. అతడు ఫుట్‌వర్క్ మీద కాస్త దృష్టిసారించాలి అని సరదాగా అన్నాడు.
దీనికి మరో ట్వీట్‌లో ఆమిర్ స్పందిస్తూ.. రవిశాస్త్రి.. నువ్వు నా ఫుట్‌వర్క్ బాగా లేదన్నావ్.. కానీ నువ్వు లగాన్ చూశావో లేవో.. కావాలంటే ఇప్పుడు మళ్లీ చూపిస్తా అంటూ డ్యాన్స్ చేస్తూ తన ఫుట్‌వర్క్ ఎలా ఉందని అడిగాడు. తనకేదైనా ఛాన్స్ ఇప్పించమనీ కోరాడు. ఇది చూసిన రాయల్స్ ఆమిర్‌కు ఇలా ఆఫర్ ఇచ్చింది. దీంతో రాయల్స్ టీమ్ ఆఫర్‌పై ఆమిర్ తనదైన రీతిలో కాస్త సరదాగా స్పందించాడు.
"థ్యాంక్యూ రాజస్థాన్ రాయల్స్.. నాపై నమ్మకం ఉంచి మీ టీమ్‌లో ఆఫర్ ఇచ్చినందుకు. ఇది నన్ను కదిలించింది. అయితే ఈ ఏడాది మీ టీమ్ చాలా స్ట్రాంగా ఉంది. జోస్ బట్లర్ ఆరెంజ్ క్యాప్ వెంట పడ్డాడు. యుజీ పర్పుల్ క్యాప్ వెంట పడ్డాడు. నేనేమో ఆల్‌రౌండర్‌ని. నేనొస్తే ఆ రెండు క్యాప్‌లు నేనే తీసేసుకుంటాను. అందువల్ల వచ్చే ఏడాది వస్తాను. నెట్స్‌లో కలిసి ప్రాక్టీస్ చేద్దాం. ప్లేఆఫ్స్ కోసం ఆల్‌ద బెస్ట్" అని మరో వీడియో పోస్ట్ చేశాడు.
సంబంధిత కథనం