తెలుగు న్యూస్ / ఫోటో /
Foldable Smartphones | శాంసంగ్‌కు ధీటుగా.. మార్కెట్లో మడిచే ఫోన్లు
రోజురోజుకి హైటెక్ ఫోల్డబుల్ ఫోన్లు పెరిగిపోతున్నాయి. దీంతో పెద్ద పెద్ద పరిశ్రమల మధ్య పోటీ కూడా పెరిగిపోతుంది. ఒప్పో, హువాయి, మోటరోలా వంటివి పరిశ్రమలు శాంసంగ్‌కు ధీటుగా.. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో తమ హైటెక్ ఫోల్డబుల్ ఫోన్లను ప్రదర్శించారు.
రోజురోజుకి హైటెక్ ఫోల్డబుల్ ఫోన్లు పెరిగిపోతున్నాయి. దీంతో పెద్ద పెద్ద పరిశ్రమల మధ్య పోటీ కూడా పెరిగిపోతుంది. ఒప్పో, హువాయి, మోటరోలా వంటివి పరిశ్రమలు శాంసంగ్‌కు ధీటుగా.. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో తమ హైటెక్ ఫోల్డబుల్ ఫోన్లను ప్రదర్శించారు.
(1 / 7)
ఫ్లిప్ ఫోన్ తిరిగి వస్తోందని.. పరిశ్రమలోని ప్రముఖులు కొత్త హైటెక్ వెర్షన్‌ను ఆశిస్తున్నారని.. ఏఎఫ్పీ నివేదిక పేర్కొంది. తాజాగా మార్చి 1వ తేదీన బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో హువాయికి చెందిన పీ50 పాకెట్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ను తనిఖీ చేస్తున్న వ్యక్తి ఫోటో ఇది.(AFP)
(2 / 7)
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ బార్సిలోనాలోని హువాయి టెక్నాలజీ అండ్ కో స్టాండ్‌లో హాజరైన వ్యక్తి పీ50 పాకెట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాండిల్ చేసేందుకు ఇచ్చారు. ఉత్పత్తి ఖర్చులు తగ్గడం ప్రారంభించినందున, 2026 నాటికి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు పది రెట్లు పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.(Bloomberg)
(3 / 7)
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షియోమీ స్టాండ్ వద్ద షియోమీ మిక్స్ ఫోల్డ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను పరిశీలిస్తున్న దృశ్యం.(AFP)
(4 / 7)
శాంసంగ్ గెలాక్సీ జీ ఫోల్డ్ 3 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను మార్చి 1వ తేదీన బార్సిలోనాలోని ఎండబ్ల్యూసీలో ప్రదర్శించారు. మూడేళ్ల క్రితం బార్సిలోనా కాన్ఫరెన్స్‌లో మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను అందించి శాంసంగ్ అగ్రగామీగా నిలిచింది. డీఎస్సీసీ ప్రకారం గతేడాది ఫోల్డబుల్ ఫోన్ అమ్మకాలలో దక్షిణ కొరియా సంస్థ 87 శాతం వాటాను కలిగి ఉన్నట్లు ఏఎఫ్పీ నివేదికలో పేర్కొంది.(AFP)
(5 / 7)
బార్సిలోనాలో ఎండబ్ల్యూసీ ప్రదర్శన ప్రారంభ రోజున హాజరైనవారు ఒప్పో ఫైండ్ ఎన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాండిల్ చేసేందుకు అనుమతి ఇచ్చారు. 'ఫైండ్ ఎన్' ప్రస్తుతం ఆసియాలో మాత్రమే అందుబాటులో ఉంది. చైనాలో ఆకట్టుకునే అమ్మకాలను చూసిందని.. కంపెనీ ఉత్పత్తుల హెడ్ ఆర్నే హెర్కెల్‌మాన్ ఏఎఫ్పీకి చెప్పారు.(Bloomberg)
(6 / 7)
ఎమ్‌డబ్ల్యూసీ బార్సిలోనా ప్రారంభం రోజున హువాయి.. టెక్నాలజీస్ అండ్ కో స్టాండ్ వద్ద హాజరైనవారు పీ 50 పాకెట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కోసం ఆర్డర్లు ఇచ్చారు.(Bloomberg)
(7 / 7)
సందర్శకులు మార్చి 1న బార్సిలోనాలోని ఎండబ్ల్యూసీ వద్ద దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ స్టాండ్‌లో గెలాక్సీ జీ ఫోల్డ్ 3 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను తనిఖీ చేశారు. ఇదిలా ఉండగా కంపెనీ తన తాజా మోడల్‌లు గెలాక్సీ ఫోల్డ్, గెలాక్సీ జీ ఫ్లిప్ వినియోగదారులకు కొత్త అనుభవాన్ని అందిస్తుందని విశ్వసిస్తోంది.(AFP)
ఇతర గ్యాలరీలు