Dhana trayodashi 2024: ధన త్రయోదశికి ఏ రాశి వాళ్ళు ఏం కొనుగోలు చేస్తే అదృష్టం వరిస్తుందో తెలుసా?
Dhana trayodashi 2024: ధన త్రయోదశికి ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి కొనాలని ప్లాన్ చేసుకుంటారు. మీరు అలాగే అనుకుంటున్నారా? అయితే మీ రాశి ప్రకారం వీటిని కొనుగోలు చేయండి. ఆర్థిక శ్రేయస్సుతో పాటు దీర్ఘకాలిక లాభాలను ఇస్తుంది. ఏ రాశి వాళ్ళు ఏం కొనుగోలు చేయాలంటే..
దీపావళి వేడుకలు ధన త్రయోదశితోనే ప్రారంభం అవుతాయి. లక్ష్మీదేవి ఆశీస్సులు కోరుకుంటూ ధన త్రయోదశి రోజు కొత్త వస్తువులు ఏవైనా కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 29న ధన త్రయోదశి జరుపుకోనున్నారు.
ఈరోజు బంగారం వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే మీరు కూడా ధన త్రయోదశికి వస్తువులు షాపింగ్ చేయాలని అనుకుంటున్నారా? ఏ రాశి వారు ఎటువంటి వస్తువులు కొనుగోలు చేస్తే అదృష్టం, శ్రేయస్సు పొందగలుగుతారో తెలుసుకోండి.
మేష రాశి
దీర్ఘకాలిక ఆర్థిక లాభాల కోసం బంగారం, వెండి, వజ్రా భరణాలు వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేయడం మంచిది. అలాగే ఇనుము, తోలు లేదా రసాయనాలతో తయారు చేసిన ఉత్పత్తులను పొరపాటున కూడా కొనొద్దు.
వృషభ రాశి
బంగారం, వెండి, కాంస్య పాత్రలు, విలువైన వస్తువులు కొనుగోలు చేయొచ్చు .ఇది కొనలేని వాళ్లు కుంకుమ పువ్వు, గంధం కూడా కొనుగోలు చేయడం వల్ల అదృష్టం పొందుతారు. ఇది పవిత్రమైనవిగా భావిస్తారు.
మిథున రాశి
బంగారం, వెండి వంటివి కాకుండా ఇంటికి కావలసిన ఫర్నిచర్, భూమి, ఆస్తులు వంటివి కొనుగోలు చేసుకోవచ్చు. ఒకవేళ కొత్తగా ఏమైనా ఆస్తులు కొంటున్నట్లయితే మిథున రాశి వాళ్లు ఈరోజు ఒప్పందం చేసుకునేందుకు శుభ సమయం.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు పిల్లలకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేసి వాళ్లకు బహుమతిగా ఇవ్వవచ్చు. సృజనాత్మకత ఉండే బహుమతులు ఏవైనా వారికి ఇవ్వడం వల్ల సంతోషంగా ఉంటారు.
సింహ రాశి
సింహ రాశి జాతకులు ఈరోజు ఎలక్ట్రానిక్, చెక్క వస్తువులు, వాహనాలు, విలువైన లోహాలు ఏవైనా కొనుగోలు చేయవచ్చు. అయితే ఇనుము, సిమెంట్ ఆధారిత వస్తువుల కొనుగోలుకు మాత్రం దూరంగా ఉండాలి.
కన్యా రాశి
కన్యా రాశి వాళ్లు ఎలక్ట్రానిక్ పరికరాలు, గ్యాడ్జెట్ వంటి కొనుక్కోవచ్చు. ఈ రాశి వాళ్లు ఈరోజు బంగారం, వెండి, వజ్రాభరణాలు కొనకుండా ఉండటమే మంచిది.
తులా రాశి
తులా రాశి జాతకులు కూడా ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ఖరీదైనవే కొనాలని అనవసరంగా డబ్బులు వృధా చేయకుండా అవసరాలకు తగిన వస్తువులు మాత్రమే ఎంచుకోవడం ఉత్తమం.
వృశ్చిక రాశి
బంగారం, వెండి, వస్త్రాలు, మట్టి పాత్రలు వంటి వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. అయితే అవసరం లేకపోయినా కానీ కొనుగోలు చేయడం మాత్రం నివారించాలి.
ధనుస్సు రాశి
ఈరోజు ధనుస్సు రాశి వారు ఆస్తులు కొనుగోలు చేసేందుకు మంచి రోజు. ఇవి వారికి దీర్ఘకాల సంపద, అదృష్టం, శ్రేయస్సును అందిస్తాయి. భవిష్యత్తులో మంచి రాబడిని అందిస్తాయి.
మకర రాశి
లోహాలు, వంట పాత్రలు, విలువైన వస్త్రాలు, బంగారం వంటివి కొనుగోలు చేసుకోవచ్చు. ఈ సమయంలో మకర రాశి వారు ఎందులోనైనా పెట్టుబడి పెట్టిన అవి దీర్ఘ కాలంలో లాభాలను అందిస్తాయి.
కుంభ రాశి
కుంభ రాశి వాళ్లు పుస్తకాలు, వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నిచర్, గృహాలంకరణ వస్తువులు వంటివి ధన త్రయోదశి రోజు కొనుగోలు చేయవచ్చు.
మీన రాశి
అదృష్టం అందిపుచ్చుకోవడం కోసం మీన రాశి వాళ్ళు బంగారం, వెండి, రత్నాలు వంటి వాటిని కొనుగోలు చేసుకోవచ్చు. ఇది మీకు భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకొస్తాయి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్