Vastu Tips for Kitchen: వంట గదిలో ఈ రంగులు వాడుతున్నారా? అశాంతి, అనారోగ్యమే-vastu tips for kitchen know which color we should use ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Vastu Tips For Kitchen Know Which Color We Should Use

Vastu Tips for Kitchen: వంట గదిలో ఈ రంగులు వాడుతున్నారా? అశాంతి, అనారోగ్యమే

HT Telugu Desk HT Telugu
May 25, 2023 03:08 PM IST

వాస్తు శాస్త్రానికి విరుద్ధంగా వంట గదిలో కొన్ని రంగులు ఉపయోగిస్తే ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వంట గదిలో ఉపయోగించాల్సిన రంగులు, వాడకూడని రంగులను ఇక్కడ తెలుసుకోండి.

కిచెన్‌లో ఉండాల్సిన, ఉండకూడని రంగులేవో తెలుసుకోండి
కిచెన్‌లో ఉండాల్సిన, ఉండకూడని రంగులేవో తెలుసుకోండి

వాస్తు శాస్త్రం ప్రకారం వంట గదిలో కొన్ని రంగులు వాడకూడదు. నీలం, ముదురు బూడిద, ఊదా రంగులను అస్సలు ఉపయోగించకూడదు. వాస్తు ప్రకారం ఈ రంగులను వంట గదిలో ఉపయోగిస్తే ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ రంగులు వాడడం వల్ల మీ వంట గదిలో, ముఖ్యంగా మీ ఇంటి చుట్టూ సానుకూల శక్తిని ప్రభావితం చేస్తాయి.

ట్రెండింగ్ వార్తలు

నిజానికి వంట గది అనేది అత్యంత ముఖ్యమైన ప్రదేశం. ప్రతి కుటుంబ సభ్యుడికి ఇక్కడ ఆహారాన్ని తయారు చేసుకుంటాం. వాస్తు శాస్త్రం ప్రకారం నారింజ, గోధుమ, తెలుపు, పసుపు, ఆకు పచ్చ రంగులు మీ వంట గదికి ఉత్తమమైన రంగుల్లో కొన్ని. కిచెన్‌లో ఉండే ర్యాకులు, సొరగులు, శ్లాబుకు ఈ రంగులు వాడడం మంచిది.

వంట గదుల్లో నల్ల రాయి వాడడం చాలా సర్వసాధారణం. చాలా ఇళ్లలో ఈ రంగు రాయిని వంట గదిలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా కిచెన్ ప్లాట్‌ఫామ్‌ కోసం వాడుతారు. కానీ ఇది వాస్తు శాస్త్రం ప్రకారం ఇది తప్పు. నల్ల రాయి వంట గదిలో ఉంటే అది మానసిక అశాంతి, అనారోగ్యానికి కారణమవుతుంది. నలుపు రంగు వంట గదికి అస్సలు మంచిది కాదు. వంట గదిలో ఈ రంగు అస్సలే ఉపయోగించకూడదు.

కొన్ని కారణాల వల్ల వంట గదిలో బ్లాక్ శ్లాబ్ ఉండి దాన్ని తొలగించేందుకు వీలు కాని పక్షంలో కనీసం గ్యాస్ స్టవ్ కింద ఆకు పచ్చ లేదా పసుపు రంగు రాయిని ఉంచితే ప్రతికూల శక్తి నుంచి ఉపశమనం లభిస్తుంది.

WhatsApp channel

టాపిక్